PC: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022 సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతిని గంటకు 157 కిమీ వేగంతో విసిరాడు. కాగా అంతకముందు సీఎస్‌కేతో మ్యాచ్‌లో గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతి వేశాడు. తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్ కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు టాప్ 5 ఫాస్టెస్ట్ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్ పేరిటే ఉన్నాయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్.. 7 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను గెలుచుకోవడం విశేషం.
PC: IPL Twitter
ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన జాబితాలో షాన్ టైట్ తొలి స్థానంలో ఉన్నాడు. 2011 ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున షాన్ టైట్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో గంటకు 157.71 కిమీ వేగంతో సంధించడం విశేషం. తాజాగా ఉమ్రాన్ మాలిక్ 157 కిమీ వేగంతో విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక అన్‌రిచ్ నోర్ట్జే(156.22, 154.74) మూడో స్థానంలో ఉండగా.. డేల్ స్టెయిన్ 154.4 కిమీ వేగంతో నాలుగో స్థానంలో, కగిసో రబాడ 154.23 కిమీ వేగంతో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బంతి కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు.. ఏంటి ఉపయోగం!
Comments
Please login to add a commentAdd a comment