యార్కర్‌ దెబ్బకు శ్రేయాస్‌ అయ్యర్‌ క్లీన్‌బౌల్డ్‌; రియాక్షన్‌ అదిరే | IPL 2022: Dale Steyn Reaction Viral Umran Malik Yorker Shreyas Iyer Bowled | Sakshi
Sakshi News home page

IPL 2022: యార్కర్‌ దెబ్బకు శ్రేయాస్‌ అయ్యర్‌ క్లీన్‌బౌల్డ్‌; రియాక్షన్‌ అదిరే

Published Fri, Apr 15 2022 11:20 PM | Last Updated on Fri, Apr 15 2022 11:28 PM

IPL 2022: Dale Steyn Reaction Viral Umran Malik Yorker Shreyas Iyer Bowled - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ ఔటైన విధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్రాన్‌ మాలిక్‌ యార్కర్‌ దెబ్బకు అయ్యర్‌ ఔట్‌ కాగానే డగౌట్‌లో ఉన్న ప్రొటీస్‌ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇచ్చిన రియాక్షన్‌ అదిరింది. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తన జట్టును కాపాడుకునే ప్రయత్నంలో శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆడుతున్నాడు.

కేన్‌ విలియమ్సన్‌ 10వ ఓవర్‌ వేయమని బంతిని ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇచ్చాడు. ఉమ్రాన్‌ ఆఖరి బంతిని యార్క్‌ర్‌ వేశాడు. ఉమ్రాన్‌ యార్కర్‌కు అయ్యర్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. బులెట్‌ వేగంతో వచ్చిన బంతి అయ్యర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. మీటర్‌ రీడింగ్‌లో ఉమ్రాన్‌ వేసిన బంతి గంటకు 148.8 కిమీ వేగంతో వచ్చింది. ఈ సమయంలో అందరు ఉమ్రాన్‌ను అభినందిస్తున్న వేళ స్టెయిన్‌ మాత్రం ఎగిరి గంతేశాడు. ఇది కదా కావాల్సింది అన్నట్లుగా నవ్వుతూ మురళీధరన్‌ను హత్తుకొని వచ్చాడు.

స్టెయిన్‌ ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ మంచి వేగంతో బంతులు విసురుతున్నప్పటికి ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. దీంతో ఉమ్రాన్‌ బౌలింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికి స్టెయిన్‌ మాత్రం అతనిపై నమ్మకముంచాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ త్వరలోనే టీమిండియా జట్టులో చూస్తానని కూడా స్టెయిన్‌ ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. తన నమ్మకాన్ని నిలబెట్టాడు గనుకనే స్టెయిన్‌ నుంచి అంత రియాక్షన్‌ వచ్చింది.

చదవండి: IPL 2022: అంపైర్‌ పొరపాటు ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చింది

శ్రేయాస్‌ అయ్యర్‌ వికెట్‌ కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement