దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ (PC: Sunrisers Eastern Cape)
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్ రాయల్స్- ఎంఐ కేప్‌టౌన్‌తో మ్యాచ్‌తో ప్రొటిస్ పొట్టి లీగ్‌కు తెరలేచింది.
ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్ మార్కరమ్ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.
పర్ల్‌తో మ్యాచ్‌లో
అయితే, ఎంఐ కేప్‌టౌన్‌ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. గురువారం నాటి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్‌కు దిగిన పర్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.
సమిష్టి కృషితో..
ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్ తీయగా.. వాన్ డెర్ మెర్వె, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్స్ ఆడం రాసింగ్‌టన్ 20 రన్స్ స్కోరు చేయగా, జోర్డాన్ హెర్మన్ 43 పరుగులతో రాణించాడు.
ఫ్యాన్స్ ఖుషీ
ఇక కెప్టెన్ మార్కరమ్ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పర్ల్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మార్కరమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ హైలైట్‌గా నిలిచారు. కాగా సన్‌రైజర్స్ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రైజర్స్ ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు.
చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్ క్వార్టర్స్ అవకాశాలు?!
కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్
Top scorer in his first #SA20 game! 👊
— Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023
Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q
Comments
Please login to add a commentAdd a comment