సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో స్టబ్స్(56), అబెల్(55) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెర్మెన్(42), మార్‌క్రమ్(42) పరుగులతో రాణించారు. డర్బన్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, టాప్లీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ 115 పరుగులకే కుప్పకూలింది.
సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్ 5 వికెట్లతో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు బార్ట్‌మన్, వారెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. డర్బన్ బ్యాటర్లలో ముల్డర్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ కీలక పోరులో హాఫ్ సెంచరీతో చెలరేగిన అబెల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన హెన్రిస్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. కాగా గతేడాది జరిగిన తొట్టతొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment