విండీస్‌ పేసర్‌పై 4 వన్డేల నిషేధం | Gabriel Banned For Four ODIs After Exchange With Joe Root | Sakshi
Sakshi News home page

విండీస్‌ పేసర్‌పై 4 వన్డేల నిషేధం

Published Thu, Feb 14 2019 11:45 AM | Last Updated on Thu, Feb 14 2019 11:47 AM

Gabriel Banned For Four ODIs After Exchange With Joe Root - Sakshi

దుబాయి: ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ జోరూట్‌ను ‘గే’ గా సంబోంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట​ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాబ్రియెల్‌పై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమైంది. గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం పాటు మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత విధించింది. తాజా ఘటన తర్వాత గాబ్రియెల్‌ ఖాతాలో మూడు డీమెరిట్‌ పాయింట్లు చేరాయి. దాంతో అతని మొత్తం డీమెరిట్‌ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధానికి లేక నాలుగు వన్డేల నిషేధానికి సమానం. ఈ క్రమంలోనే గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది. 

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్- షానన్‌ గాబ్రియల్‌ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆట లో జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దాంతో జో రూట్‌ను గేగా సంబోంధించడానే అభియోగాలపై ఐసీసీ విచారణ చేపట్టింది. అనంతరం గాబ్రియెల్‌పై డీమెరిట్‌ పాయింట్ల ఆధారంగా నాలుగు వన్డేల నిషేధం విధించింది.



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement