West Indies vs India, 1st ODI: టీమిండియాతో వన్డే సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తామని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న లోపాలు సరిచేసుకుని, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ అయిన విండీస్ ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.
టాప్-8లో నేరుగా అడుగుపెట్టలేకపోయిన షాయీ హోప్ బృందం.. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్స్ ఆడింది. ఈ క్రమంలో యూఎస్‌ఏ, యూఏఈ, నేపాల్ వంటి పసికూనలపై గెలిచిన విండీస్.. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓడి పరాజయాల ఖాతా తెరిచింది.
ఘోర పరాభవం
అనంతరం.. వర్షం కారణంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ టై కావడం.. ఆపై సూపర్ ఓవర్‌లో ఓటమి, ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో చిత్తైన నేపథ్యంలో టాప్-2లో నిలవాలన్న వెస్టిండీస్ ఆశలకు గండిపడింది. ఆపై ఒమన్‌పై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో అడుగుపెట్టగా.. విండీస్ ఇంటిబాట పట్టింది.
ఈ క్రమంలో ఘోర పరాభవం తర్వాత పటిష్ట టీమిండియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా గురువారం (జూలై 27)న మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన విండీస్ సారథి షాయీ హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం
‘‘తిరిగి పుంజుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం. వైవిధ్యమైన వన్డే ఫార్మాట్లో మా నైపుణ్యాలు ప్రదర్శించి.. మేం చేయగలమో ప్రపంచానికి చూపించే మరో అవకాశం దొరికింది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
అలా అయితే విజయం మాదే
లోపాలు సరిచేసుకుని మళ్లీ కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి అందరికీ గెలిచే అవకాశం రాకపోవచ్చు. అయితే, లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం లోపం ఉండకూడదు. అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది’’ అని షాయీ హోప్ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు.
అతడు తిరిగి రావడం సంతోషం
ఇక షిమ్రన్ హెట్‌మెయిర్ జట్టులోకి తిరిగి రావడంపై స్పందిస్తూ.. ‘‘బౌలర్లపై విరుచుపడుతూ దూకుడగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మా జట్టులో ఉన్న నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్ అతడు. హెట్‌మెయిర్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’అని షాయీ హోప్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా షాయీ హోప్‌నకు స్వదేశంలో తొలి వన్డే ఇది.
చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment