కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ఉదయం బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గయానా బ్యాటర్ షాయ్ హోప్ మెరుపు సెంచరీతో చెలరేగాడు.
కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హోప్ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన రహ్కీమ్ కార్న్‌వాల్ బౌలింగ్‌లో హోప్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హోప్ 9ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. హోప్ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది.
దీంతో 88 పరుగుల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లార్క్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ
RIDICULOUS SCENES!!! Shai Hope hits Rahkeem Cornwall for 32 in the over to reach his first CPL 💯 🙌 - A clear winner for Republic Bank Play of the Day#CPL23 #GAWvBR#CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/NCYi5OZerX
— CPL T20 (@CPL) September 18, 2023
Comments
Please login to add a commentAdd a comment