
లండన్ : 'వయసులో చిన్నదానిలా కనిపిస్తున్నా.. ఫుట్‌వర్క్‌లో మాత్రం నీకు నువ్వే సాటి.. పరిశర్మ 'అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, విండీస్ ఆటగాడు షాయ్ హోప్ లు పేర్కొన్నారు. ఇంతకీ పరి శర్మ ఎవరు .. వీరిద్దరు ఆమెను ఎందుకు పొగుడుతున్నరనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. ఇండియాకు చెందిన పరి శర్మ వయసు ఏడేళ్లే అయినా క్రికెట్ శిక్షణలో మాత్రం రాటు దేలిందనే చెప్పాలి. ప్రాక్టీస్‌లో భాగంగా కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడుతూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంది. ('మ్యాచ్‌లు లేకపోవడంతో బోర్‌గా ఫీలవుతున్నా')
తాజాగా పరిశర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ మైకేల్ వాన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. 'వీడియోను ఒకసారి చూడండి.. ఏడేళ్ల పరి శర్మ ఫుట్‌వర్క్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక పరిపూర్ణమైన షాట్లను ఆడడానికి మందు ఫుట్ వర్క్ ఎంతో అవసరం. ఆ విషయంలో పరిశర్మను ఎవరు అందుకోలేరు' అంటూ పేర్కొన్నాడు. ఇదే వీడియోనూ షాయ్ హోప్ కూడా షేర్ చేస్తూ..' నీ ఫుట్‌వర్క్‌కు జోహార్లు.. నేను పెద్దయ్యాక పరిశర్మ లాగే ఉండాలనుకున్నా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పరి శర్మ ఫుట్‌వర్క్, బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉన్నాయి.. ఏదో ఒకరోజు క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment