కోల్‌కతా: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడైన హోప్ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలంపై తాను పెద్దగా దృష్టి సారించలేదంటూ కూడా వెల్లడించాడు. అది తనకు సెకండరీ అంటూ ప్రకటించాడు.
ఇక దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్‌ను సైతం కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.. స్టెయిన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా అతనిపై బిడ్ వేయలేదు. దాంతో స్టెయిన్‌కు నిరాశ తప్పలేదు. ఇక భారత ఆటగాడు మోహిత్ శర్మ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా వేలంలో ఫ్రాంచైజీలను ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కూడా అమ్ముడు పోలేదు. వేలం చివర్లో ఒకవేళ ఫ్రాంఛైజీలకు ఆటగాళ్లు అవసరమైన వారి వద్ద అందుకు తగ్గ నగుదు అందుబాటులో ఉంటేనే వీరు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment