IPL Auction 2020
-
'ఐపీఎల్లో ఆడనందుకు నాకు బాధ లేదు'
ముంబై : చటేశ్వర్ పుజార.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇప్పటితరంలో అద్భుతమైన స్ట్రోక్ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న పుజార పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టీ20 పనికిరాడంటూ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అంశమే అతన్ని టీ20తో పాటు ఐపీఎల్‌కు దూరం చేసింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో పుజారను ఏ ఐపీఎల్ జట్టు కూడా కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. తాజాగా ఐపీఎల్ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చటేశ్వర్ పుజార మరోసారి స్పందించాడు. 'నేను ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధ లేదు. ఐపీఎల్‌కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారని.. అందులో వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న హషీమ్ ఆమ్లా లాంటి ఆటగాడు కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు.. అందులో నేను ఒకడిని. మేము ఐపీఎల్లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్‌గా మాత్రమే గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా. టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్‌లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది చెప్పండి. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్లో సాధించే విజయం కన్నా దేశంకోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజార 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి. -
‘చెన్నైకి తీసుకొచ్చి తీరుతాం’
హైదరాబాద్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఎగిరిగంతేస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్-2020 వేలంలో ఈ ఇంగ్లీష్ క్రికెటర్‌ను చెన్నైసూపర్‌కింగ్స్(సీఎస్కే) రూ. 5.5కోట్లతో చేజిక్కించుకోవడమే కరన్ ఆనందానికి కారణం. ఇంత భారీ మొత్తంలో దిగ్గజ సారథి ధోని సారథ్యంలోని సీఎస్కే తరుపున ఆడనుండటంపై కరన్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. స్యామ్ కరన్ వీడియోను సీఎస్కే తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. సీఎస్కే తరుపున ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కరన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘నా ఎంపికకు సహకరించిన ధోని, ఫ్లెమింగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో చెన్నైలో ప్రత్యర్థి జట్టు సభ్యుడిగా బరిలోకి దిగాను. కానీ ఈసారి చెన్నై అభిమానుల సమక్షంలో సీఎస్కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. అభిమానుల అంచనాలను అందుకునేలా గొప్ప ప్రదర్శన ఇస్తామనే ధీమా ఉంది. అంతేకాకుండా చెన్నైకి రావడానికి, నా కొత్త టీం సభ్యులను కలుసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. ధోని సారథ్యంలో.. ఫ్లెమింగ్ కోచింగ్‌లో ఆడటం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఐపీఎల్-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామనే విశ్వాసం ఉంది’అంటూ కరన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న సీఎస్కే జట్టు గత సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. గత సీజన్లో అసాధరణ పోరాటపటిమతో ఆకట్టుకున్న ధోని జట్టు చివరి మెట్టుపై బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే గత అనుభవాల దృష్ట్య జట్టులో అనేక మార్పులు చేసింది. దీనిలో భాగంగా బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కరన్, చావ్లా, హేజిల్‌వుడ్‌లను జట్టులోకి తీసుకుంది. దీంతో సీఎస్కే బౌలింగ్ దళం దుర్బేద్యంగా తయారయ్యింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని సారథ్యంలోని సీఎస్కే జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. -
‘మార్చి 28న వద్దే వద్దు’
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 ప్రారంభ తేదీపై గందరగోళం ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 28 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభించాలని గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. అయితే దీనిపై ఎనిమిది ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయంట. అంతేకాకుండా ప్రారంభ తేదీని ఏప్రిల్ 1కి మార్చాలని ప్రాంఛైజీలు డిమాండ్ చేస్తున్నాయని సమాచారం. దీంతో గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రారంభ తేది మార్పుపై అన్ని ఫ్రాంచైజీలు పట్టుపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని ఓ ఫ్రాంచైజీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ‘ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్ మార్చి 29న, అదేవిధంగా ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ మార్చి 31న ముగియనున్నాయి. దీంతో ఈ నాలుగు జట్లకు సంబంధించిన క్రికెటర్లు ఏప్రిల్ 1వరకు ఐపీఎల్ జట్లతో చేరరు. అంతేకాకుండా వచ్చిన వెంటనే ధనాధన్ ఆట ఆడాలంటే వారిపై అధిక శ్రమ భారం పడుతుంది. దీంతో కొన్ని మ్యాచ్‌లను లేక కొన్ని రోజులైన వారికి విశ్రాంతి నివ్వాలి. అనుకున్న తేదీ ప్రకారమే మ్యాచ్‌లు ప్రారంభమైతే ఈ నాలుగు దేశాల క్రికెటర్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లు ఆడలేరు. దీంతో మాకు ఆట పరంగా, అంచనాల పరంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ఈ నష్టం తమకే కాకుండా ఐపీఎల్ కళ దెబ్బతింటుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఆ నాలుగు దేశాలకు చెందిన క్రికెటర్లే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక అదే ఏప్రిల్ 1 నుంచి ఐపీఎల్ ప్రారంభమైతే కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే వారు దూరమవుతారు. దీంతో పెద్దగా నష్టం జరగదు. ఇదే విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఈ అంశంపై త్వరలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు’అని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
అక్కడ ఉంది నేను.. గెలవడం పక్కా!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13కు సంబంధించి జరిగిన ఆటగాళ్ల వేళంలో దక్షిణాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2కోట్లకు స్టెయిన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరడంపై స్టెయిన్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్టెయిన్ తన దైన స్టైల్లో సమాధానాలిచ్చాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..‘తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను’అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ‘ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి’అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ‘ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది’అంటూ ఫ్యాన్స్ అడిగిన దానికి బదులిచ్చాడు ఈ స్పీడ్‌గన్. ఇక స్టెయిన్ ఐపీఎల్ అరంగేట్రం చేసింది ఆర్సీబీ జట్టులో అయినప్పటికీ.. ఆ జట్టుకు తొమ్మిదేళ్ల దూరంగా ఉన్నాడు. తిరిగి ఐపీఎల్-2019లో బెంగళూరు జట్టులో చేరినప్పటికీ రెండు మ్యాచ్‌ల అనంతరం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అయితే తాజా వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. కానీ వేలంలో అనూహ్యంగా తిరిగి చేజిక్కించుకుంది. స్టెయిన్‌తో పాటు రిచర్డ్సన్, మోరిస్, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది. ఇప్పటికే బ్యాటింగ్‌లో దుమ్ములేపే కోహ్లి జట్టు బౌలింగ్ బలం పెరగడంతో వచ్చే సీజన్లో హాజ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. కోహ్లితో చర్చించే తీసుకున్నాం: మైక్ హెసన్ ‘వేలం ప్రారంభానికి ముందే అనుకున్నాం స్టెయిన్ అవసరం ఆర్సీబీకి ఉందని, అయితే అతడు కనీసం రూ. 3నుంచి 4 కోట్లు పలుకుతాడని భావించాం. కానీ మేము ఊహించింది జరగలేదు. లక్కీగా స్టెయిన్‌ను వేలంలో చేజిక్కించుకున్నాం. బౌలర్ల ఎంపిక విషయంలో సారథి కోహ్లితో పదేపదే చర్చించాం. మిడిల్ ఓవర్లలో మంచి బౌలర్ కావాలని అతడు కోరాడు. అందుకోసం ఉదాన సరైన వ్యక్తిగా భావించాం. దీంతో స్టెయిన్, ఉదానలను ఎంపిక చేశాం’అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ పేర్కొన్నాడు. -
కేకేఆర్ జట్టు నిర్ణయాన్ని తప్పుబట్టిన గంభీర్!
న్యూఢిల్లీ: పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ తప్పుబట్టాడు. ఓ బౌలర్ కోసం భారీ మొత్తం చెల్లించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం జరిగిన వేలంలో ఆసీస్ పేస్ బౌలర్ కమిన్స్‌ను రూ. 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్ రికార్డుకెక్కాడు. కాగా కేకేఆర్ జట్టును రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. బౌలర్‌కు అత్యధిక ధర చెల్లించి బ్యాకప్ బ్యాట్స్‌మెన్ లేకుండా చేసుకున్నారని విమర్శించాడు. ‘కొత్త బంతితో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించగలడు. అతడికి మంచి బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. డెత్ ఓవర్లలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టగలుగుతాడు 2014లో అతడు కేకేఆర్‌తో ఉన్నాడు. ఇక అప్పటితో పోలిస్తే తన ఆట తీరు ఎంతో మెరుగుపడింది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించి జట్టు అతడిని కొనుక్కుంది.. కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శన కనబరుస్తాడనుకుంటున్నా. కనీసం 3-4 మ్యాచులైనా ఒంటిచేత్తో గెలిపించగలగాలి. ఇవన్నీ కమిన్స్‌కు సంబంధించిన సానుకూల అంశాలు. అయితే ఒకవేళ బ్యాట్స్మెన్లు ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్ గాయపడితే పరిస్థితి ఏంటి. వారికి బ్యాకప్‌గా ప్రస్తుత జట్టులో ఎవరూ లేరు. ఇక సునీల్ నరైన్ విషయానికొస్తే తను బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. ముందు చెప్పినట్లు ఇయాన్ గాయపడితే మిడిలార్డర్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాదు కమిన్స్ గాయపడితే అతడి స్థానంలో లాకీ ఫెర్గూసన్ ఉంటాడు. కానీ టాప్ ఆర్డర్లో మాత్రం ఎవరు గాయపడినా వారి స్థానాన్ని భర్తీ చేసేవారు జట్టులో లేరు. మిచెల్ మార్ష్‌ను గానీ, మార్కర్ స్టోయినిస్‌ను గానీ తీసుకునే ఉంటే బాగుండేది’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కాగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం సొంత జట్టు ఢిల్లీకి తిరిగొచ్చిన గౌతీ.. జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఆటకు వీడ్కోలు పలికిన గౌతీ.. రాజకీయాల్లో ప్రవేశించి తూర్పు ఢిల్లీ ఎంపీగా ఎన్నికయ్యాడు.(ఐపీఎల్ వేలం 2020కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కోల్‌కతా నైట్ రైడర్స్ 2020 ఐపీఎల్ వేలంలో సొంతం చేసుకున్న ఆటగాళ్లు ►ప్యాట్ కమిన్స్ రూ. 15.5 కోట్లు ►మోర్గాన్ రూ. 5.25 కోట్లు ►వరుణ్ చక్రవర్తి రూ. 4.0 కోట్లు ►టామ్ బాంటన్ రూ. 1.0 కోట్లు ►రాహుల్ త్రిపాఠి రూ. 60 లక్షలు ►క్రిస్ గ్రీన్ రూ. 20 లక్షలు ►నిఖిల్ శంకర్ రూ. 20 లక్షలు ►ప్రవీణ్ తాంబే రూ. 20 లక్షలు ►సిద్ధార్థ్ రూ. 20 లక్షలు -
ఈసారి ఐపీఎల్ వేలంలో వారిదే హవా
ఐపీఎల్ 2020కి సంబంధించి డిసెంబర్ 19న కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. ఈ సారి నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు వీదేశీ ఆటగాళ్లపై రూ.140.30 కోట్లు ఖర్చు చేశాయి. దీంట్లో అత్యధికంగా 13 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.58.25 కోట్లు వెచ్చించారు. తర్వాతి స్థానంలో రూ. 17.75 కోట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు, రూ. 17.25 కోట్లతో కరేబియన్ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రూ. 15.50 కోట్లకు కేకేఆర్ దక్కించుకోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం గెలుచుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరో ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ రూ.10.75 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకోగా, నాథన్ కౌల్టర్‌నీల్‌ను ముంబయి ఇండియన్స్ రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ఇక చివరిదాకా వేలంలో కొనసాగిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను మొదట్లో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా చివరి రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4. 80 కోట్లకు దక్కించుకోవడం విశేషం. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన ఆరోన్ పించ్‌ను ఆర్సీబీ రూ. 4.40 కోట్లకు దక్కించుకుంది. ఇక వేలంలో తీసుకున్న మిగతా ఆటగాళ్లను చూస్తే.. కేన్ రిచర్డ్సన్(ఆర్సీబీ), అలెక్స్ క్యారీ ( ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్(సన్‌రైజర్స్), క్రిస్ లిన్ ( ముంబయి ఇండియన్స్), అండ్రూ టై( రాజస్థాన్ రాయల్స్), టామ్ బాంటన్( కేకేఆర్), జూయిస్ ఫిలిప్ (ఆర్సీబీ), క్రిస్ గ్రీన్ (కేకేఆర్)లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయానికి వస్తే 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రూ. 5.50 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను రూ. 5.50 కోట్లతో చైన్నె సూపర్ కింగ్స్, అతని అన్న టామ్ కరణ్‌ను రూ. 1 కోటితో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్లలో క్రిస్ జోర్డాన్( కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), జాసన్ రాయ్, క్రిస్ వోక్స్ ( ఢిల్లీ క్యాపిటల్స్)లు ఉన్నారు. కరీబియన్ ఆటగాళ్లలో విండీస్ ఫాస్ట్‌బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, స్టార్ బ్యాట్సమెన్ షిమ్రన్ హెట్మైర్ను రూ. 7.75 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. కాగా ప్రతీసారి వేలంలో ముందుండే దక్షిణాప్రికా, న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈ సారి వేలంలో కొనడానికి ప్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను మాత్రమే రూ.10 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. డేల్ స్టేయిన్, డేవిడ్ మిల్లర్లు తమ బేస్ ప్రైస్‌కే ప్రాంచైజీలకు అమ్ముడుపోయారు. (చదవండి : ముగిసిన ఐపీఎల్ వేలం) (చదవండి : ఐపీఎల్ వేలం చరిత్రలోనే..) -
సందీప్‌కు అవకాశం
వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ఒక్క ఆటగాడికే అవకాశం దక్కింది. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ బావనక సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు తీసుకుంది. గతంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్, యెర్రా పృథీ్వరాజ్లపై ఈసారి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సందీప్ 38 టి20ల్లో 126.77 స్ట్రైక్‌రేట్‌తో 734 పరుగులు చేశాడు. వేలంలో కాకుండా ఇప్పటికే హైదరాబాద్ నుంచి మొహమ్మద్ సిరాజ్ బెంగళూరు తరఫున... అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. సిరాజ్‌ను బెంగళూరు రూ. 2 కోట్ల 60 లక్షలకు... రాయుడిని చెన్నై రూ. 2 కోట్ల 20 లక్షలకు అట్టి పెట్టుకున్నాయి. -
కోట్లాభిషేకం
ఐపీఎల్ వేలంలో ఆ్రస్టేలియా క్రికెటర్ల పంట పండింది. ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు ధరతో కోల్‌కతా జట్టు చెంత చేరగా... మ్యాక్స్‌వెల్, కూల్టర్ నీల్, ఫించ్, స్టొయినిస్, క్యారీ, మిషెల్ మార్‡్షలకు కూడా భారీ మొత్తాలు లభించాయి. వన్డే ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ కెపె్టన్ మోర్గాన్‌ను కూడా నైట్‌రైడర్స్ దక్కించుకోగా, మరో ఇంగ్లండ్ ఆటగాడు స్యామ్ కరన్‌ను చెన్నై సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌తో పాటు ‘సెల్యూట్’ కాట్రెల్, హెట్‌మైర్ పెద్ద మొత్తం దక్కించుకున్న ఇతర ఆటగాళ్లు. 73 స్థానాల కోసం 338 ఆటగాళ్లు పోటీ పడిన ఈ వేలంలో భారత అండర్–19 కుర్రాళ్లు కోటీశ్వరులుగా మారడం చెప్పుకోదగ్గ విశేషం. ఖాళీలు 73 ఉన్నా వేలంలో మాత్రం 62 మందినే తీసుకున్నారు. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం సాగిన వేలంలో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు రికార్డు మొత్తం లభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 15 కోట్ల 50 లక్షలకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ. 14 కోట్ల 50 లక్షలకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను దక్కించుకోవడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఓవరాల్‌గా మాత్రం 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు యువరాజ్ సింగ్‌కు ఇచి్చన రూ. 16 కోట్లు ఇప్పటికీ రికార్డుగానే ఉంది. రూ. 2 కోట్ల కనీస ధరతో కమిన్స్ కోసం వేలం మొదలైంది. ఈ దశ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) జట్లు అతని కోసం పోటీ పడి మొత్తాన్ని పెంచుతూ వెళ్లాయి. ఆర్సీబీకి సొంతమైనట్లుగా అనిపించిన దశలో అనూహ్యంగా కోల్‌కతా బరిలోకి వచి్చంది. చివరకు అదే జట్టు ఆస్ట్రేలియా పేసర్‌ను గెలుచుకుంది. ‘వేలంలో అందుబాటులో ఉన్నవారిలో కమిన్స్ అత్యుత్తమ ఆటగాడు. గత కొన్నేళ్లలో అతను ఎంతో ఎదిగాడు. అతని ఆట అద్భుతంగా మారింది. అలాంటి క్రికెటర్‌ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని కోల్‌కతా హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన ఉత్సాహం మీదున్న ఇయాన్ మోర్గాన్‌ను కూడా రూ. 5.25 కోట్లకు నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయితే జట్టు కెప్టెన్‌గా మాత్రం దినేశ్ కార్తీక్ కొనసాగుతాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్‌ను ఈ సారి అదే ఫ్రాంచైజీ రూ. 10.75 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ‘కమిన్స్ ఖుష్’ ‘ఐపీఎల్ వేలంలో ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడం ఖాయం’... వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్య ఇది. అందుకు తగినట్లుగానే ఢిల్లీతో పాటు బెంగళూరు కూడా కమిన్స్ కోసం పోటీ పడ్డాయి. చివరకు ఈ రెండు జట్లు తప్పుకోగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అతడిని సొంతం చేసుకుంది. గత రెండు సీజన్లుగా ఐపీఎల్ ఆడని కమిన్స్ 2017లో 15 వికెట్లు పడగొట్టి ఢిల్లీ జట్టు తరఫున అగ్రస్థానంలో నిలిచాడు. నాటితో పోలిస్తే ఇప్పుడు కమిన్స్ బౌలింగ్ మరింత పదునెక్కింది. గతంలో గాయాలతో ఇబ్బంది పడిన అతను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా మారి ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న కమిన్స్, వన్డేల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. నిలకడగా 140 కిలో మీటర్లకు తగ్గని వేగంతో బౌలింగ్ చేసే కమిన్స్ జట్టులో ఉండటం ఏ జట్టుకైనా బలమే. ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి వికెట్ తీయగలిగితే ప్రత్యరి్థపై పైచేయి సాధించవచ్చు. కమిన్స్‌లో ఆ సత్తా ఉందని నమ్మిన నైట్‌రైడర్స్ భారీ మొత్తాన్ని వెచి్చంచింది. బ్యాట్స్‌మన్, ఆల్రౌండర్లకు పెద్ద విలువ దక్కే ఐపీఎల్లో ఒక విదేశీ పేసర్‌కు రూ. 15 కోట్ల 50 లక్షలు ఇవ్వడం పెద్ద విశేషమే! కేకేఆర్ టీమ్‌లో ఇప్పటికే ఫెర్గూసన్, గరీ్న, ప్రసిధ్ కృష్ణ, శివమ్ మావి, కమలేశ్ నాగర్కోటి రూపంలో రెగ్యులర్ పేసర్లు ఉన్నారు. కమిన్స్ గతంలోనూ కోల్‌కతా తరఫున ఆడాడు. 2014–15 సీజన్లలో 4 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. రూ.11.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు... ఐపీఎల్లో రెగ్యులర్‌గా ఆడుతూ వేర్వేరు ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లలో ఇద్దరు భారత క్రికెటర్లకు మెరుగైన ధర పలికింది. రాబిన్ ఉతప్ప, జైదేవ్ ఉనాద్కట్లకు చెరో రూ. 3 కోట్లు ఇచ్చి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గత ఏడాది ఐపీఎల్ కోసం ఇదే రాజస్తాన్ జట్టు ఉనాద్కట్‌కు రూ.11.5 కోట్లు ఇచి్చన విషయం గమనార్హం. 2019 ఐపీఎల్ కోసం ‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ పంజాబ్ జట్టు వరుణ్ చక్రవర్తికి ఏకంగా రూ. 8.4 కోట్లు చెల్లించి తీసుకుంది. అయితే ఒకే ఒక మ్యాచ్ ఆడిన తర్వాత గాయంతో అతను సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు వరుణ్‌కు రూ. 4 కోట్లు (కోల్‌కతా) దక్కాయి. అనూహ్యం! వేలంలో చెన్నై జట్టు లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను రూ. 6.5 కోట్లకు కొనుక్కుంది. చావ్లా ఇటీవలి ఫామ్, అతను దేశవాళీలో సొంత జట్టు యూపీని వదిలి గుజరాత్‌కు ఆడుతున్న తీరును బట్టి చూస్తే ఈ మొత్తం ఆశ్చర్యకరం. అదీ ఎంతో లెక్కతో, జాగ్రత్తగా వేలంలో పాల్గొనే చెన్నై ఇలా ఎంచుకోవడం విశేషంగా అనిపించింది. అయితే నలుగురు విదేశీ ఆటగాళ్ల నిబంధనలో తాహిర్ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో పాటు చెన్నై పిచ్ ఇటీవల మరీ నెమ్మదించడం కూడా కారణంగా కనిపిస్తోంది. అదే విధంగా గత ఐపీఎల్లో పేలవ ప్రదర్శన, జాతీయ జట్టులో చోటు లేని విషయాలు చూసుకుంటే క్రిస్ మోరిస్‌కు కూడా ఆర్సీబీ రూ. 10 కోట్లు ఇవ్వడం చాలా ఎక్కువ! వీరికి సారీ! టి20 క్రికెట్లో గతంలో అద్భుతాలు చేసి ఇప్పుడు కళ తప్పినవారు కొందరైతే, మొదటి నుంచి పొట్టి క్రికెట్లో పెద్దగా గుర్తింపు లేనివారు మరికొందరు... అంతర్జాతీయ క్రికెట్లో మంచి రికార్డు ఉన్నా, ఐపీఎల్ వరకు వచ్చేసరికి అనామకులుగా కనిపించి ఎవరూ ఆసక్తి చూపించని ఆటగాళ్లు ఇంకొందరు... ఇలా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన చెప్పుకోదగ్గ ఆటగాళ్ల జాబితాను చూస్తే... భారత టెస్టు జట్టు సభ్యులు చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ ఎంచుకోలేదు. పుజారా టి20 బ్యాటింగ్‌పై మొదటి నుంచి ఎవరికీ నమ్మకం లేకపోగా, గత ఏడాది ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లకే పరిమితమైన ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈసారి అవకాశం దక్కలేదు. ఒకప్పుడు విధ్వంసక ఆటగాడైన యూసుఫ్ పఠాన్, ఇటీవలి వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన గ్రాండ్‌హోమ్, భారత్‌పై తాజా పర్యటనలో చెలరేగుతున్న షై హోప్, కివీస్ రెగ్యులర్ ఆటగాళ్లు గప్టిల్, కొలిన్ మున్రోలను ఎవరూ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ ఆటగాడు ముషి్ఫకర్ కూడా అయ్యో పాపం అనిపించాడు. గతంలో ఎప్పుడూ ఐపీఎల్ ఆడని అతను ఈసారి వేలానికి ముందు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత మనసు మార్చుకొని మళ్లీ వేలంలోకి వచ్చాడు. కానీ ఎవరూ అతనిపై ఆసక్తి చూపించలేదు. 14 ఏళ్ల అఫ్గాన్ కుర్రాడు నూర్ అహ్మద్ వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. అండర్–19 బ్యాచ్ నుంచి ముగ్గురికి చోటు త్వరలో జరిగే అండర్–19 ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్న ఆటగాళ్లలో ముగ్గురికి ఐపీఎల్లో మంచి విలువ పలికింది. ప్రియమ్ గార్గ్ (సన్‌రైజర్స్–రూ.1.9 కోట్లు), యశస్వి జైస్వాల్ (రాజస్తాన్–రూ.2.4 కోట్లు), కార్తీక్ త్యాగి (రాజస్తాన్–రూ. 1.3 కోట్లు) అందుకోనున్నారు. రోడ్డుపై పానీపూరీలు అమ్మే స్థాయి నుంచి ముంబై సీనియర్ జట్టు వరకు ఎదిగిన సంచలన ఆటగాడు యశస్వికి భారీ మొత్తం లభించడం విశేషం. వేలం విశేషాలు ►48 ఏళ్ల ప్రవీణ్ తాంబేను కనీస ధర రూ. 20 లక్షలకు కోల్‌కతా జట్టు తీసుకుంది. ►దిగ్గజ పేసర్ స్టెయిన్ రెండు సార్లు వేలానికి వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు. మూడోసారి వేలంలో అతడిని కనీస ధర రూ. 2 కోట్లకు బెంగళూరు ఎంచుకుంది. ►కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెపె్టన్‌గా లోకేశ్ రాహుల్, బ్యాటింగ్ కోచ్‌గా వసీమ్ జాఫర్ వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ ప్రకటించింది. ►ఫించ్‌కు ఐపీఎల్లో బెంగళూరు ఎనిమిదో జట్టు కావడం విశేషం. గతంలో అతను ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై, పుణే, రాజస్తాన్, హైదరాబాద్ జట్లకు ఆడాడు. ‘ఐపీఎల్ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండేందుకు న్యూజిలాండ్‌తో మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటావని ఆశిస్తున్నా.’ –కమిన్స్‌ను ఉద్దేశించి మెకల్లమ్ ట్వీట్ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా చెన్నై సూపర్ కింగ్స్ ►పీయూశ్ చావ్లా రూ. 6.75 కోట్లు ►స్యామ్ కరన్ రూ. 5.5 కోట్లు ►హాజల్‌వుడ్ రూ. 2.0 కోట్లు ►సాయికిశోర్ రూ. 20 లక్షలు ఢిల్లీ క్యాపిటల్స్ ►హెట్‌మైర్ రూ. 7.75 కోట్లు ►స్టొయినిస్ రూ. 4.8 కోట్లు ►అలెక్స్ క్యారీ రూ. 2.4 కోట్లు ►జేసన్ రాయ్ రూ. 1.5 కోట్లు ►క్రిస్ వోక్స్ రూ. 1.5 కోట్లు ►మోహిత్ శర్మ రూ. 50 లక్షలు ►తుషార్ దేశ్‌పాండే రూ. 20 లక్షలు ►లలిత్ యాదవ్ రూ. 20 లక్షలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ►మ్యాక్స్‌వెల్ రూ. 10.75 కోట్లు ►కాట్రెల్ రూ. 8.5 కోట్లు ►క్రిస్ జోర్డాన్ రూ. 3.0 కోట్లు ►రవి బిష్ణోయ్ రూ. 2.0 కోట్లు ►ప్రభుసిమ్రన్ సింగ్ రూ. 55 లక్షలు ►దీపక్ హుడా రూ. 50 లక్షలు ►జేమ్స్ నీషమ్ రూ. 50 లక్షలు ►తజిందర్ ధిల్లాన్ రూ. 20 లక్షలు ►ఇషాన్ పోరెల్ రూ. 20 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్ ►ప్యాట్ కమిన్స్ రూ. 15.5 కోట్లు ►మోర్గాన్ రూ. 5.25 కోట్లు ►వరుణ్ చక్రవర్తి రూ. 4.0 కోట్లు ►టామ్ బాంటన్ రూ. 1.0 కోట్లు ►రాహుల్ త్రిపాఠి రూ. 60 లక్షలు ►క్రిస్ గ్రీన్ రూ. 20 లక్షలు ►నిఖిల్ శంకర్ రూ. 20 లక్షలు ►ప్రవీణ్ తాంబే రూ. 20 లక్షలు ►సిద్ధార్థ్ రూ. 20 లక్షలు ముంబై ఇండియన్స్ ►కూల్టర్‌నీల్ రూ. 8.0 కోట్లు ►క్రిస్ లిన్ రూ. 2.0 కోట్లు ►సౌరభ్ తివారీ రూ. 50 లక్షలు ►దిగి్వజయ్ దేశ్‌ముఖ్ రూ. 20 లక్షలు ►ప్రిన్స్ బల్వంత్రాయ్ రూ. 20 లక్షలు ►మోహ్సిన్ ఖాన్ రూ. 20 లక్షలు రాజస్తాన్ రాయల్స్ ►రాబిన్ ఉతప్ప రూ. 3.0 కోట్లు ►జైదేవ్ ఉనాద్కట్ రూ. 3.0 కోట్లు ►యశస్వి జైస్వాల్ రూ. 2.4 కోట్లు ►కార్తీక్ త్యాగి రూ. 1.3 కోట్లు ►టామ్ కరన్ రూ. 1.0 కోట్లు ►ఆండ్రూ టై రూ. 1.0 కోట్లు ►అనుజ్ రావత్ రూ. 80 లక్షలు ►డేవిడ్ మిల్లర్ రూ. 75 లక్షలు ►ఒషానే థామస్ రూ. 50 లక్షలు ►అనిరుధ అశోక్ జోషి రూ. 20 లక్షలు ►ఆకాశ్ సింగ్ రూ. 20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ►క్రిస్ మోరిస్ రూ. 10.0 కోట్లు ►ఆరోన్ ఫించ్ రూ. 4.4 కోట్లు ►కేన్ రిచర్డ్సన్ రూ. 4.0 కోట్లు ►స్టెయిన్ రూ. 2.0 కోట్లు ►ఇసురు ఉదాన రూ. 50 లక్షలు ►షాబాజ్ అహ్మద్ రూ. 20 లక్షలు ►జోషువా ఫిలిప్ రూ. 20 లక్షలు ►పవన్ దేశ్‌పాండే రూ. 20 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ►మిచెల్ మార్ష్ రూ. 2.0 కోట్లు ►ప్రియమ్ గార్గ్ రూ. 1.9 కోట్లు ►విరాట్ సింగ్ రూ. 1.9 కోట్లు ►ఫాబియాన్ అలెన్ రూ. 50 లక్షలు ►బావనాక సందీప్ రూ. 20 లక్షలు ►సంజయ్ యాదవ్ రూ. 20 లక్షలు ►అబ్దుల్ సమద్ రూ. 20 లక్షలు ►మ్యాక్స్‌వెల్ రూ. 10.75 కోట్లు ►మోరిస్ రూ. 10 కోట్లు ►కాట్రెల్ రూ. 8.50 కోట్లు ►కూల్టర్ నీల్ రూ. 8 కోట్లు ►హెట్‌మైర్ రూ. 7.75 కోట్లు -
ముగిసిన ఐపీఎల్ వేలం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్‌కు సంబంధించి జరిగిన వేలం ముగిసింది. ఈసారి కోల్‌కతా వేదికగా జరిగిన వేలంలో పలువురు క్రికెటర్లకు ఊహించని ధరలు దక్కగా, చాలామంది స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ఊహించినట్లుగానే ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, ఆసీస్ స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్‌కు 15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్‌వెల్ రూ. 10.5 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. భారత యువ క్రికెటర్లలో ముందుగా ఊహించినట్లుగానే యశస్వి జైస్వాల్, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్ వేలంలో ఫర్వాలేదనిపించారు. భారత ఆండర్-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకోగా, జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన గార్గ్-జైస్వాల్‌ల కనీస ధర రూ. 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక పీయూష్ చావ్లా వేలంలో అదుర్స్ అనిపించాడు. రూ. 6.75 కోట్లకు చెన్నె సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. చాహ్ల కనీస ధర రూ . 1 కోటి ఉండగా సీఎస్కే రూ.6.75 కోట్లతో అతన్ని దక్కించుకుంది. వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ కొనుగోలు చేసింది. వరుణ్ చక్రవర్తికి రూ. 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్ దక్కించుకుంది. దీపక్ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ హిట్ మ్యాన్ హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, రూ. 7.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. వినయ్ కుమార్ చివరి ఆటగాడిగా వేలంలోకి రాగా, అతన్ని ఏ ఒక్క ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. 13 వ ఐపీఎల్ సీజన్‌కు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే... క్రిస్ లిన్ : రూ.2 కోట్లు - ముంబయి ఇండియన్స్ (కనీస ధర) ఇయాన్ మోర్గాన్ : రూ. 5.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ ( కనీస ధర రూ.2 కోట్లు) రాబిన్ ఊతప్ప : రూ. 3 కోట్లు - రాజస్థాన్ రాయల్స్ ( కనీస ధర : 1.50 కోట్లు) జాసన్‌రాయ్ : రూ. 1.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర) ఆరోన్ పించ్ : రూ. 4.4 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర 1 కోటి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ : రూ.10.5 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 2కోట్లు) క్రిస్ వోక్స్ : కనీస ధర రూ . 1.50 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్ ప్యాట్ కమ్మిన్స్ : రూ.15.50 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 2కోట్లు) శామ్ కరణ్ : రూ. 5.50కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్ (కనీస ధర రూ . 1కోటి) క్రిస్ మోరిస్ : రూ. 10 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర రూ .1.50 కోట్లు) చతేశ్వర పుజారా, స్టువర్ట్ బిన్నీ, యూసఫ్ పఠాన్.. వీరిపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. తొలి రౌండ్లో వీరి ముగ్గురికీ నిరాశే ఎదురైంది. వీరి కోసం ఏ ఫ్రాంచైజీ కనీసం బిడ్‌ను కూడా వేయలేదు. చివర్లో ఏమైనా అవకాశం ఉంటే కానీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. అలెక్స్ క్యారి : రూ.2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ . 50 లక్షలు) జయదేవ్ ఉనద్కట్ : రూ. 3కోట్లు - రాజసా్థన్ రాయల్స్ (కనీస ధర రూ . 1 కోటి) నాథన్ కౌల్టర్‌నీల్ : రూ. 8 కోట్లు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర రూ . 1 కోటి) షెల్డన్ కాట్రెల్ : రూ. 8.50 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 50 లక్షలు) పీయూష్ చావ్లా : రూ. 6.75 కోట్లు - చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర రూ . 1 కోటి) రాహల్ త్రిపాఠి : రూ .60 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) విరాట్ సింగ్ : రూ .1.90 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర రూ. 20 లక్షలు) ప్రియమ్ గార్గ్ : రూ. 1.90 కోట్లు-సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర రూ. 20 లక్షలు) దీపక్ హుడా : రూ. 50 లక్షలు - కింగ్స్ లెవెన్ పంజాబ్(కనీస ధర రూ. 40 లక్షలు) వరుణ్ చక్రవర్తి : రూ. 4 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 30 లక్షలు) యశస్వి జైస్వాల్ : రూ. 2.40 కోట్లు రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) ఆకాశ్ సింగ్ : రూ. 20 లక్షలు- రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర ) కార్తిక్ త్యాగి : రూ. 1.30 కోట్లు - రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) ఇషాన్ పోరేల్ : రూ. 20 లక్షలు - కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర ) ఎం సిద్ధార్థ్ : రూ. 20 లక్షలు - కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) రవి బిష్ణోయి : రూ. 1.80 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ. 20 లక్షలు) షిమ్రోన్ హెట్మెయిర్ : రూ. 7.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ. 50 లక్షలు) డేవిడ్ మిల్లర్ : రూ. 75 లక్షలు - రాజస్థాన్ రాయల్స్( కనీస ధర) సారభ్ తివారి : రూ. రూ. 50 లక్షలు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర) మిచెల్ మార్ష్ : రూ. 2 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర) జిమ్మీ నీషమ్ : రూ. 50 లక్షలు -కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర ) జోష్ హాజల్‌వుడ్ : రూ. 2 కోట్లు - చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర) సందీప్ బవానక : రూ.రూ. 20 లక్షలు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) క్రిస్ గ్రీన్ : రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర) టామ్ బాన్‌టన్ : రూ . 1 కోటి- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) జాషూవా ఫిలిప్ : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర ) క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 75 లక్షలు) కేన్ రిచర్డ్సన్ : రూ. 4కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర రూ . 1 .50 కోట్లు) ప్రవీణ్ తాంబే : రూ. 20 లక్షలు-కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) అబ్దుల్ సమన్ : రూ. 20 లక్షలు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) సంజయ్ యాదవ్ : రూ. 20 లక్షలు-సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) దిగ్విజయ్ దేశ్‌ముఖ్ : రూ. 20 లక్షలు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర ) మోహిత్ శర్మ : రూ .50 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) పవన్ దేశ్ పాండే : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) పభ్ సిమ్రన్ సింగ్: రూ. 55 లక్షలు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ. 20 లక్షలు) తుషార్దేశ్పాండే : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) ఆర్ సాయి కిషోర్ : రూ. 20 లక్షలు-చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర ) మార్కస్ స్టోయినిస్ : రూ.4.80 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ. 1 కోటి) డేల్ స్టేయిన్ : రూ . 2కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(కనీస ధర ) అండ్రూ టై : రూ . 1 కోటి- రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర ) లలిత్ యాదవ్ : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) షాబాజ్ అహ్మద్ : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) నిఖిల్ నాయక్ : రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) టామ్ కర్జన్ : రూ . 1 కోటి- రాజస్థాన్ రాయల్స్(కనీస ధర ) ఇసురు ఉదన : రూ . 50 లక్షలు -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) -
పానీపూరి అమ్మడం నుంచి కరోడ్‌పతి వరకూ..
లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్ అనడానికి భారత అండర్ 19 క్రికెటర్ యశస్వి జైస్వాల్ జీవితమే ఉదాహరణ. భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటే లక్ష్యంగా సత్తాచాటుతున్న యశస్వి జైస్వాల్ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు. అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్‌పతిని చేసింది. పానీపూరి అమ్మే స్టేజ్ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్ జీవితం. ఈసారి ఐపీఎల్ వేలంలో జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన జైస్వాల్‌ల కనీస ధర రూ. 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు జైస్వాల్‌పై ఆసక్తి చూపాయి. చివరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్ క్లబ్’ క్రికెట్ గ్రౌండ్లో ఒక మూలన ఉండే టెంట్లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. యశస్వి గాథలు ఆజాద్ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్–19 ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించిన అతను ఇప్పుడు సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 ఆసియా కప్ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్ విజేతగా నిలిచిన ఆ టోర్నీలో యశస్వి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్ తారగా ఆశలు రేపేలా చేసింది. ప్రస్తుతం అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడుతున్న యశస్వి.. ఐపీఎల్లో ఆకట్టుకుంటే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఏమాత్రం కష్టం కాదు. -
ఎస్ఆర్హెచ్కు గార్గ్.. ఆర్ఆర్కు జైస్వాల్
కోల్‌కతా: ఊహించినట్లే భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్ వేలంలో ఫర్వాలేదనిపించారు. భారత ఆండర్-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకోగా, జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన గార్గ్-జైస్వాల్‌ల కనీస ధర రూ. 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ కొనుగోలు చేసింది. వరుణ్ చక్రవర్తికి రూ. 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్ దక్కించుకుంది. దీపక్ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. -
ఐపీఎల్-2020 వేలం.. చావ్లా అదుర్స్
-
కాట్రెల్‌కు కింగ్స్ ‘భారీ’ సెల్యూట్
కోల్‌కతా: వెస్టిండీస్ పేసర్ షెల్డాన్ కాట్రెల్ గురించి ముందుగా చెప్పాలంటే అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తూ ఉంటుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఐపీఎల్ వేలంలో కాట్రెల్‌కు కింగ్స్ పంజాబ్ పెద్ద సెల్యూటే చేసింది. అతన్ని రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. భారత్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో కాట్రెల్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ ఇలా అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. పలు ఫ్రాంఛైజీలు కాట్రెల్‌కు కోసం పోటీ పడగా కింగ్స్ పంజాబ్ అతన్ని కొనుగోలు చేయడం విశేషం. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న హోప్ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్ ఉన్నాడు. కానీ అతనికి తొలి రౌండ్ వేలంలో అమ్ముడుపోలేదు. మరి చివర్లో హోప్‌పై ఏ ఫ్రాంఛైజీ అయినా దృష్టి పెడుతుందుమో చూడాలి. -
షాయ్ హోప్‌పై నో ఇంట్రెస్ట్..!
కోల్‌కతా: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడైన హోప్ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలంపై తాను పెద్దగా దృష్టి సారించలేదంటూ కూడా వెల్లడించాడు. అది తనకు సెకండరీ అంటూ ప్రకటించాడు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్‌ను సైతం కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.. స్టెయిన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా అతనిపై బిడ్ వేయలేదు. దాంతో స్టెయిన్‌కు నిరాశ తప్పలేదు. ఇక భారత ఆటగాడు మోహిత్ శర్మ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా వేలంలో ఫ్రాంచైజీలను ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కూడా అమ్ముడు పోలేదు. వేలం చివర్లో ఒకవేళ ఫ్రాంఛైజీలకు ఆటగాళ్లు అవసరమైన వారి వద్ద అందుకు తగ్గ నగుదు అందుబాటులో ఉంటేనే వీరు అమ్ముడుపోయే అవకాశం ఉంది. -
ఐపీఎల్ వేలం చరిత్రలోనే..
కోల్‌కతా: ఐపీఎల్ -2020 సీజన్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న వేలంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్స్ కమ్మిన్స్ జాక్‌పాట్ కొట్టేశాడు. కమ్మిన్స్ కనీస ధర రెండు కోట్లు ఉండగా అతనికి రూ. 15.50 కోట్ల భారీ ధర పలికింది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్ కోసం పోటీ పడగా చివరకూ కేకేఆర్ కమిన్స్‌ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకుమించి అమ్ముడుపోవడం విశేషం. ప్రధానంగా రాయల్స్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా, కేకేఆర్ కచ్చితంగా కమ్మిన్స్‌ను దక్కించుకోవాలనే ఊపుతో అతని కోసం భారీ ధర వెచ్చించింది.ఫలితంగా రూ. 15 కోట్లకు పైగా కమ్మిన్స్‌కు ధర పలికింది. కాగా, ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. -
మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర
కోల్‌కతా: ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్-2020 వేలంలో భారీ ధర పలికింది. అతని కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా 10 కోట్లకు పైగా అమ్ముడుపోయాడు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ కింగ్స్ పంజాబ్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 10. 75 కోట్లకు దక్కించుకుంది. గత పలు సీజన్లలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ మళ్లీ ఆ జట్టుకు ఆడనున్నాడు. తొలి రౌండ్లో మ్యాక్స్‌వెల్ ఆల్ రౌండర్‌గా రేసులోకి వచ్చాడు. అతని కోసం బిడ్‌ను కింగ్స్ పంజాబ్ ఆరంభించి చివరకు వశం చేసుకుంది. ఇక మరో ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీపడినప్పటికీ ఆఖరికి ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్ కనీస ధర 1 కోటి ఉండగా, రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుఉంది. -
క్రిస్ లిన్‌కు జాక్‌పాట్ లేదు..!
కోల్‌కతా: ఈసారి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. క్రిస్ లిన్‌పై మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపెట్టకపోవడంతో అతను కనీస ధరకే పరిమితమయ్యాడు. ఈ వేలంలో లిన్‌కు అత్యధిక ధర పలుకుతుందని ఊహించనప్పటికీ లిన్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కోత్ నైట్ రైడర్స్ కూడా తమ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్‌ను వదిలేసుకుంది. క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్ వదిలేసుకుందనేది కాదనలేని వాస్తవం. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్ సాధించాడు. మరాఠా అరేబియన్స్ తరుఫున లిన్ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అయినప్పటికీ లిన్ కోసం పెద్దగా పోటీ లేకుండా పోయింది. ఇక్కడ ముంబై ఇండియన్స్ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేయడంతో జాక్‌పాట్ కొట్టిందనే చెప్పాలి. -
ఐపీఎల్-2020 వేలం అప్డేట్స్..ఢిల్లీకి హెట్మెయిర్
కోల్‌కతా: వచ్చే సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి వేలం ఆరంభమైంది. హాట్‌హాట్‌గా జరుగనున్న ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలాన్ని కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు. ఊహించినట్లుగానే ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, ఆసీస్ స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. ఇంకా యువ ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఊహించినట్లే భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్ వేలంలో ఫర్వాలేదనిపించారు. భారత ఆండర్-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకోగా, జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన గార్గ్-జైస్వాల్‌ల కనీస ధర రూ. 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక పీయూష్ చావ్లా వేలంలో అదుర్స్ అనిపించాడు. రూ. 6.75 కోట్లకు చెన్నె సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. చాహ్లి కనీస ధర రూ . 1 కోటి ఉండగా సీఎస్కే భారీ మొత్తంలోనే అతన్ని దక్కించుకుంది. వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ కొనుగోలు చేసింది. వరుణ్ చక్రవర్తికి రూ. 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్ దక్కించుకుంది. దీపక్ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ హిట్ మ్యాన్ హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, రూ. 7.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు పాల్గొంటుండగా, వీరిలో 134 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్స్ జాబితా 198గా ఉంది. ఓవరాల్‌గా 73 మంది ఆటగాళ్లు మాత్రమే అవసరం కాగా, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉంటారు. కేకేఆర్‌కు మోర్గాన్ ఈసారి ఐపీఎల్ వేలం తొలి రౌండ్లో భారత టెస్టు స్పెషలిస్టు చతేశ్వర పుజారాక నిరాశే ఎదురైంది. తొలి రౌండ్లో పుజారాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌కు దూరమైన పుజారా టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్ర పడటంతో అతనికి ఐపీఎల్ వేలం కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఆరంభంలో పలు ఫ్రాంచైజీలకు ఆడిన అనుభవం ఉన్న పుజారా.. ఈసారైన తనకు అదృష్టం దక్కుతుందని ఆశించాడు. మరి తదుపరి రౌండ్లో పుజారాను ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకోవడానికి ముందుకు వస్తుందేమో చూడాలి. ఇక మరో భారత ఆటగాడు హనమ విహారికి కూడా ఆశాభంగమే ఎదురైంది. ఫ్రాంచైజీలు విహారిని కొనుగోలు చేయడానికి బిడ్స్ వేయలేదు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ను రూ. 1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిట్స్ కొనుగోలు చేసింది. కేకేఆర్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్పను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కేకేఆర్ దక్కించుకుంది. మోర్గాన్‌ను రూ. 5.25 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్.. మోర్గాన్ కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపాడు. దాంతో మోర్గాన్‌కు ఐదు కోట్లకు పైగా ధర పలికింది. మోర్గాన్ కోసం ఢిల్లీ పోటీ పడ్డటప్పటికీ చివరకు కేకేఆర్ సొంతమయ్యాడు. కాగా వేలంలోకి వచ్చిన భారతీయ ఆటగాళ్లైన యూసఫ్ పఠాన్, చటేశ్వర్ పుజార, స్టువర్ట్ బిన్నీలను ఎవరు కొనుగోలు చేయలేదు. క్రిస్ లిన్ : రూ.2 కోట్లు - ముంబయి ఇండియన్స్ (కనీస ధర) ఇయాన్ మోర్గాన్ : రూ. 5.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ ( కనీస ధర రూ.2 కోట్లు) రాబిన్ ఊతప్ప : రూ. 3 కోట్లు - రాజస్థాన్ రాయల్స్ ( కనీస ధర : 1.50 కోట్లు) జాసన్‌రాయ్ :రూ. 1.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర) ఆరోన్ పించ్ : రూ. 4.4 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర 1 కోటి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ : రూ.10.5 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 2కోట్లు) క్రిస్ వోక్స్ : కనీస ధర రూ . 1.50 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్ ప్యాట్ కమ్మిన్స్ : రూ.15.50 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 2కోట్లు) శామ్ కరణ్ : రూ. 5.50కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్ (కనీస ధర రూ . 1కోటి) క్రిస్ మోరిస్ : రూ. 10 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర రూ .1.50 కోట్లు) చతేశ్వర పుజారా, స్టువర్ట్ బిన్నీ, యూసఫ్ పఠాన్.. వీరిపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. తొలి రౌండ్లో వీరి ముగ్గురికీ నిరాశే ఎదురైంది. వీరి కోసం ఏ ఫ్రాంచైజీ కనీసం బిడ్‌ను కూడా వేయలేదు. చివర్లో ఏమైనా అవకాశం ఉంటే కానీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. అలెక్స్ క్యారి : రూ.2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ . 50 లక్షలు) జయదేవ్ ఉనద్కట్ : రూ. 3కోట్లు - రాజసా్థన్ రాయల్స్ (కనీస ధర రూ . 1 కోటి) నాథన్ కౌల్టర్‌నీల్ : రూ. 8 కోట్లు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర రూ . 1 కోటి) షెల్డన్ కాట్రెల్ : రూ. 8.50 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 50 లక్షలు) పీయూష్ చావ్లా : రూ. 6.75 కోట్లు - చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర రూ . 1 కోటి) రాహల్ త్రిపాఠి : రూ .60 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) విరాట్ సింగ్ : రూ .1.90 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర రూ. 20 లక్షలు) ప్రియమ్ గార్గ్ : రూ. 1.90 కోట్లు-సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర రూ. 20 లక్షలు) దీపక్ హుడా : రూ. 50 లక్షలు - కింగ్స్ లెవెన్ పంజాబ్(కనీస ధర రూ. 40 లక్షలు) వరుణ్ చక్రవర్తి : రూ. 4 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర రూ. 30 లక్షలు) యశస్వి జైస్వాల్ : రూ. 2.40 కోట్లు రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) ఆకాశ్ సింగ్ : రూ. 20 లక్షలు- రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర ) కార్తిక్ త్యాగి : రూ. 1.30 కోట్లు - రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర రూ. 20 లక్షలు) ఇషాన్ పోరేల్ : రూ. 20 లక్షలు - కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర ) ఎం సిద్ధార్థ్ : రూ. 20 లక్షలు - కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) రవి బిష్ణోయి : రూ. 1.80 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ. 20 లక్షలు) షిమ్రోన్ హెట్మెయిర్ : రూ. 7.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ. 50 లక్షలు) డేవిడ్ మిల్లర్ : రూ. 75 లక్షలు - రాజస్థాన్ రాయల్స్( కనీస ధర) సారభ్ తివారి : రూ. రూ. 50 లక్షలు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర) మిచెల్ మార్ష్ : రూ. 2 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర) జిమ్మీ నీషమ్ : రూ. 50 లక్షలు -కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర ) జోష్ హాజల్‌వుడ్ : రూ. 2 కోట్లు - చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర) సందీప్ బవానక : రూ.రూ. 20 లక్షలు - సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) క్రిస్ గ్రీన్ : రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర) టామ్ బాన్‌టన్ : రూ . 1 కోటి- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) జాషూవా ఫిలిప్ : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర ) క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్లు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ . 75 లక్షలు) కేన్ రిచర్డ్సన్ : రూ. 4కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (కనీస ధర రూ . 1 .50 కోట్లు) ప్రవీణ్ తాంబే : రూ. 20 లక్షలు-కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) అబ్దుల్ సమన్ : రూ. 20 లక్షలు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) సంజయ్ యాదవ్ : రూ. 20 లక్షలు-సన్‌రైజర్స్ హైదరాబాద్ (కనీస ధర ) దిగ్విజయ్ దేశ్‌ముఖ్ : రూ. 20 లక్షలు- ముంబయి ఇండియన్స్ (కనీస ధర ) మోహిత్ శర్మ : రూ .50 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) పవన్ దేశ్ పాండే : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) పభ్ సిమ్రన్ సింగ్: రూ. 55 లక్షలు- కింగ్స్ లెవెన్ పంజాబ్ (కనీస ధర రూ. 20 లక్షలు) తుషార్దేశ్పాండే : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) ఆర్ సాయి కిషోర్ : రూ. 20 లక్షలు-చెన్నె సూపర్ కింగ్స్ (కనీస ధర ) మార్కస్ స్టోయినిస్ : రూ.4.80 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర రూ. 1 కోటి) డేల్ స్టేయిన్ : రూ . 2కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(కనీస ధర ) అండ్రూ టై : రూ . 1 కోటి- రాజస్థాన్ రాయల్స్ (కనీస ధర ) లలిత్ యాదవ్ : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్ (కనీస ధర ) షాబాజ్ అహ్మద్ : రూ. 20 లక్షలు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) నిఖిల్ నాయక్ : రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (కనీస ధర ) టామ్ కర్జన్ : రూ . 1 కోటి- రాజస్థాన్ రాయల్స్(కనీస ధర ) ఇసురు ఉదన : రూ . 50 లక్షలు -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కనీస ధర ) -
ధరలు పలికే ధీరులెవ్వరో!
కోల్‌కతా: ఐపీఎల్ 2020 సీజన్ ఆట కోసం నేడు ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసేదాకా ఎదురుచూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా... వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది. కరీబియన్ హిట్టర్ హెట్‌మైర్ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచి్చంచేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడకపోవచ్చు. టెస్టులకు పరిమితమైన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా... పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆంధ్ర నుంచి ఆరుగురు (విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్), హైదరాబాద్ నుంచి నలుగురు (సందీప్, తిలక్ వర్మ, యు«ద్వీర్, మిలింద్) ఉన్నారు.