ఐపీఎల్‌-2020 వేలం అప్‌డేట్స్‌..ఢిల్లీకి హెట్‌మెయిర్‌ | IPL Auction 2020 Live Updates And Streaming In Telugu | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2020 వేలం అప్‌డేట్స్‌

Published Thu, Dec 19 2019 2:17 PM | Last Updated on Thu, Dec 19 2019 9:06 PM

IPL Auction 2020 Live Updates And Streaming In Telugu - Sakshi

కోల్‌కతా:  వచ్చే సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు సంబంధించి వేలం ఆరంభమైంది. హాట్‌హాట్‌గా జరుగనున్న ఐపీఎల్‌-2020 ఆటగాళ్ల వేలాన్ని కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు. ఊహించినట్లుగానే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. ఇంకా యువ ఆటగాళ్లు జాక్‌పాట్‌ కొట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ఊహించినట్లే భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్‌ వేలంలో ఫర్వాలేదనిపించారు. భారత ఆండర్‌-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేయగా,  గార్గ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకోగా, జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ అయిన గార్గ్‌-జైస్వాల్‌ల కనీస ధర రూ. 20  లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి.

ఇక పీయూష్‌ చావ్లా వేలంలో అదుర్స్‌ అనిపించాడు. రూ. 6.75 కోట్లకు చెన్నె సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.  చాహ్లి కనీస ధర రూ . 1 కోటి ఉండగా సీఎస్‌కే  భారీ మొత్తంలోనే అతన్ని దక్కించుకుంది. వరుణ్‌ చక్రవర్తిని కేకేఆర్‌ కొనుగోలు చేసింది. వరుణ్‌ చక్రవర‍్తికి రూ. 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్‌ దక్కించుకుంది. దీపక్‌ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50  లక్షలకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు  చేసింది. వెస్టిండీస్‌ హిట్‌ మ్యాన్‌ హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, రూ. 7.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు పాల్గొంటుండగా, వీరిలో 134 మంది క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇక అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ జాబితా 198గా ఉంది. ఓవరాల్‌గా 73 మంది ఆటగాళ్లు మాత్రమే అవసరం కాగా, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉంటారు. 

కేకేఆర్‌కు మోర్గాన్‌
ఈసారి ఐపీఎల్‌ వేలం తొలి రౌండ్‌లో భారత టెస్టు స్పెషలిస్టు చతేశ్వర పుజారాక నిరాశే ఎదురైంది. తొలి రౌండ్‌లో పుజారాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌కు దూరమైన పుజారా టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్ర పడటంతో అతనికి ఐపీఎల్‌ వేలం కలిసి రావడం  లేదు. ఐపీఎల్‌ ఆరంభంలో పలు ఫ్రాంచైజీలకు ఆడిన అనుభవం ఉన్న పుజారా.. ఈసారైన తనకు అదృష్టం దక్కుతుందని ఆశించాడు. మరి తదుపరి రౌండ్‌లో పుజారాను ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకోవడానికి ముందుకు వస్తుందేమో చూడాలి.

ఇక మరో  భారత ఆటగాడు హనమ విహారికి కూడా ఆశాభంగమే ఎదురైంది. ఫ్రాంచైజీలు విహారిని కొనుగోలు చేయడానికి బిడ్స్‌  వేయలేదు. ఇదిలా ఉంచితే,  ఇంగ్లండ్‌ ఆటగాడు జాసన్‌ రాయ్‌ను రూ. 1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిట్స్‌ కొనుగోలు చేసింది. కేకేఆర్‌ మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్పను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను కేకేఆర్‌ దక్కించుకుంది. మోర్గాన్‌ను రూ. 5.25 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కేకేఆర్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌.. మోర్గాన్‌ కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపాడు. దాంతో మోర్గాన్‌కు ఐదు కోట్లకు పైగా ధర పలికింది. మోర్గాన్‌ కోసం ఢిల్లీ పోటీ పడ్డటప్పటికీ చివరకు కేకేఆర్‌ సొంతమయ్యాడు. కాగా వేలంలోకి వచ్చిన భారతీయ ఆటగాళ్లైన యూసఫ్‌ పఠాన్‌, చటేశ్వర్‌ పుజార, స్టువర్ట్‌ బిన్నీలను ఎవరు కొనుగోలు చేయలేదు.

క్రిస్‌ లిన్‌ : రూ.2 కోట్లు - ముంబయి ఇండియన్స్‌  (కనీస ధర) 

ఇయాన్‌ మోర్గాన్‌ : రూ. 5.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ( కనీస ధర రూ.2 కోట్లు)

రాబిన్‌ ఊతప్ప : రూ. 3 కోట్లు - రాజస్థాన్‌ రాయల్స్‌ ( కనీస ధర : 1.50 కోట్లు)

జాసన్‌రాయ్‌ :రూ. 1.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర)

ఆరోన్‌ పించ్‌ : రూ.  4.4 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు (కనీస ధర 1 కోటి)

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ :  రూ.10.5 కోట్లు- కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌  (కనీస ధర రూ . 2కోట్లు)

క్రిస్‌ వోక్స్‌ : కనీస ధర రూ . 1.50 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్‌

ప్యాట్‌ కమ్మిన్స్‌ : రూ.15.50 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌  (కనీస ధర రూ. 2కోట్లు)

శామ్‌ కరణ్‌ : రూ. 5.50కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్  (కనీస ధర రూ . 1కోటి)

క్రిస్‌ మోరిస్‌ : రూ. 10 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు (కనీస ధర రూ .1.50 కోట్లు)

చతేశ్వర పుజారా, స్టువర్ట్‌ బిన్నీ, యూసఫ్‌ పఠాన్‌.. వీరిపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. తొలి రౌండ్‌లో వీరి ముగ్గురికీ నిరాశే ఎదురైంది. వీరి కోసం ఏ ఫ్రాంచైజీ కనీసం బిడ్‌ను కూడా వేయలేదు. చివర్లో ఏమైనా అవకాశం ఉంటే కానీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు.

అలెక్స్‌ క్యారి : రూ.2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర రూ . 50 లక్షలు)

జయదేవ్‌ ఉనద్కట్‌ : రూ. 3కోట్లు - రాజసా్‌థన్‌ రాయల్స్‌ (కనీస ధర రూ . 1 కోటి)

నాథన్‌ కౌల్టర్‌నీల్‌ : రూ. 8 కోట్లు- ముంబయి ఇండియన్స్‌ (కనీస ధర రూ . 1 కోటి)

షెల్డన్‌ కాట్రెల్‌  : రూ. 8.50 కోట్లు-  కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర రూ . 50 లక్షలు)

పీయూష్‌ చావ్లా :  రూ. 6.75 కోట్లు - చెన్నె సూపర్‌ కింగ్స్‌  (కనీస ధర రూ . 1 కోటి)

రాహల్‌ త్రిపాఠి :  రూ .60 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర రూ. 20 లక్షలు)

విరాట్‌ సింగ్‌ : రూ .1.90 కోట్లు - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (కనీస ధర రూ. 20 లక్షలు)

ప్రియమ్‌ గార్గ్‌ : రూ.  1.90 కోట్లు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  (కనీస ధర రూ. 20 లక్షలు)

దీపక్‌ హుడా : రూ. 50 లక్షలు - కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌(కనీస ధర రూ. 40 లక్షలు)

వరుణ్‌ చక్రవర్తి : రూ. 4 కోట్లు-  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర రూ. 30 లక్షలు)

యశస్వి జైస్వాల్‌ :  రూ. 2.40 కోట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ (కనీస ధర రూ. 20 లక్షలు)

ఆ​కాశ్‌ సింగ్‌ :  రూ. 20 లక్షలు- రాజస్థాన్‌ రాయల్స్‌ (కనీస ధర )

కార్తిక్‌ త్యాగి  : రూ. 1.30 కోట్లు - రాజస్థాన్‌ రాయల్స్‌  (కనీస ధర రూ. 20 లక్షలు)

ఇషాన్‌ పోరేల్‌ : రూ. 20 లక్షలు - కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర )

ఎం సిద్ధార్థ్‌ : రూ. 20 లక్షలు - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర )

రవి బిష్ణోయి : రూ. 1.80 కోట్లు- కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర రూ. 20 లక్షలు)

షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ : రూ. 7.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర రూ. 50 లక్షలు)

డేవిడ్‌ మిల్లర్‌ : రూ. 75 లక్షలు - రాజస్థాన్‌ రాయల్స్‌( కనీస ధర)

సారభ్‌ తివారి : రూ. రూ. 50 లక్షలు- ముంబయి ఇండియన్స్‌ (కనీస ధర) 

మిచెల్‌ మార్ష్‌ : రూ. 2 కోట్లు - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  (కనీస ధర)

జిమ్మీ నీషమ్‌ :  రూ. 50 లక్షలు -కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర )

జోష్‌ హాజల్‌వుడ్‌ :  రూ. 2 కోట్లు - చెన్నె సూపర్‌ కింగ్స్‌ (కనీస ధర) 

సందీప్‌ బవానక : రూ.రూ. 20 లక్షలు -  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌   (కనీస ధర )

క్రిస్‌ గ్రీన్‌ :   రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర)

టామ్‌ బాన్‌టన్‌ :  రూ . 1 కోటి- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర ) 

జాషూవా ఫిలిప్‌ : రూ. 20 లక్షలు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు (కనీస ధర )

క్రిస్‌ జోర్డాన్‌ : రూ. 3 కోట్లు-  కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర రూ . 75 లక్షలు)

కేన్‌ రిచర్డ్‌సన్‌ : రూ. 4కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు (కనీస ధర రూ . 1 .50 కోట్లు​)

ప్రవీణ్‌ తాంబే : రూ. 20 లక్షలు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కనీస ధర )

అబ్దుల్‌ సమన్‌  : రూ. 20 లక్షలు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (కనీస ధర )

సంజయ్‌ యాదవ్‌ : రూ. 20 లక్షలు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌   (కనీస ధర ) 

దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ : రూ. 20 లక్షలు- ముంబయి ఇండియన్స్‌ (కనీస ధర )

మోహిత్‌ శర్మ : రూ .50 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర )

పవన్‌ దేశ్‌ పాండే : రూ. 20 లక్షలు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (కనీస ధర )

పభ్‌ సిమ్రన్‌ సింగ్‌: రూ. 55 లక్షలు- కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ (కనీస ధర రూ. 20 లక్షలు)

తుషార్‌దేశ్‌పాండే : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర )

ఆర్‌ సాయి కిషోర్‌ :  రూ. 20 లక్షలు-చెన్నె సూపర్‌ కింగ్స్‌ (కనీస ధర )

మార్కస్‌ స్టోయినిస్‌ : రూ.4.80 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర రూ. 1 కోటి)

డేల్‌ స్టేయిన్‌ : రూ . 2కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(కనీస ధర )

అండ్రూ టై : రూ . 1 కోటి-  రాజస్థాన్‌ రాయల్స్‌   (కనీస ధర )

లలిత్‌ యాదవ్‌ : రూ. 20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్‌ (కనీస ధర )

షాబాజ్‌ అహ్మద్‌ : రూ. 20 లక్షలు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  (కనీస ధర )

నిఖిల్‌ నాయక్‌ : రూ. 20 లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌  (కనీస ధర )

టామ్‌ కర్జన్‌ : రూ . 1 కోటి- రాజస్థాన్‌ రాయల్స్‌(కనీస ధర )

ఇసురు ఉదన : రూ . 50 లక్షలు -రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (కనీస ధర )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement