![IPL Auction 2020 A Look At What The 8 Franchises Need - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/19/max.jpg.webp?itok=Ngd_BzcT)
కోల్‌కతా: ఐపీఎల్ 2020 సీజన్ ఆట కోసం నేడు ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసేదాకా ఎదురుచూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా... వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది.
కరీబియన్ హిట్టర్ హెట్‌మైర్ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచి్చంచేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడకపోవచ్చు. టెస్టులకు పరిమితమైన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా... పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆంధ్ర నుంచి ఆరుగురు (విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్), హైదరాబాద్ నుంచి నలుగురు (సందీప్, తిలక్ వర్మ, యు«ద్‌వీర్, మిలింద్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment