కోల్‌కతా: ఐపీఎల్ -2020 సీజన్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న వేలంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్స్ కమ్మిన్స్ జాక్‌పాట్ కొట్టేశాడు. కమ్మిన్స్ కనీస ధర రెండు కోట్లు ఉండగా అతనికి రూ. 15.50 కోట్ల భారీ ధర పలికింది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్ కోసం పోటీ పడగా చివరకూ కేకేఆర్ కమిన్స్‌ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకుమించి అమ్ముడుపోవడం విశేషం.
ప్రధానంగా రాయల్స్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా, కేకేఆర్ కచ్చితంగా కమ‍్మిన్స్‌ను దక్కించుకోవాలనే ఊపుతో అతని కోసం భారీ ధర వెచ్చించింది.ఫలితంగా రూ. 15 కోట్లకు పైగా కమ్మిన్స్‌కు ధర పలికింది. కాగా, ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment