దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తడబడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేకేఆర్ విధించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. పాట్ కమిన్స్ వేసిన వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఇన్‌ఫామ్ బ్యాట్సమన్ సంజూ శామ్సన్ కేవలం 8 పరుగులే చేసి శివమ్ మావి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో మంచి టచ్‌లో కనిపించినా.. శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప , రియాన్ పరాగ్‌లు కూడా వెనుదిరగడంతో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది.(చదవండి : రాజస్తాన్ లక్ష్యం 175 పరుగులు)
కాగా అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ పెద్ద మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్ గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్ మెరుపులతో కేకేఆర్ 170 పరుగుల మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment