
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(49 పరుగులు) అనవసరంగా రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయలోపం అనుకుందామనుకున్నా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ కాల్‌కు సూర్య సరిగ్గానే స్పందించాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన రాహుల్ రెండు సెకన్లు ఆగిపోయాడు. ఎందుకో ఆగాడో తెలియదు కానీ.. ఆ రెండు సెకన్లు అతని కొంప ముంచింది. కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలా కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది అనుకున్న సమయంలో రాహుల్ రనౌట్ అవ్వడం బాధ కలిగించింది. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని కేఎల్ రాహుల్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ ఈజీగా వస్తుంది.. కానీ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్య కూడా వేగంగా స్పందించడంతో రాహుల్ పరిగెత్తాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయాడు. అంతే అకియెల్ హొసేన్ వేసిన బంతిని అందుకున్న కీపర్ హోప్ వికెట్లను గిరాటేశాడు. దీంతో రాహుల్ సూర్యను చూస్తూ ఏంటిది అనుకుంటూ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: 'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్‌కప్ హీరో
KL Rahul Run Out 💔#INDvWI #KLRahul #ViratKholi pic.twitter.com/qcwkQohdko
— Saqlain Khan (@Saqlainejaz56) February 9, 2022