
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అల్జారీ జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మూడో బంతిని సూర్యకుమార్ స్ట్రెయిట్‌డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అల్జారీ జోసెఫ్ తన కాలి బూటుతో బంతిని టచ్ చేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పంత్ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. దీంతో బంతి వెళ్లి బెయిల్స్‌ను ఎగురగొట్టడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఇది అనుకోకుండా జరిగినప్పటికి సూర్యకుమార్ యాదవ్ తనవల్లే ఇలా జరిగిందన్నట్లుగా హావభావాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..?
Comments
Please login to add a commentAdd a comment