వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు బీసీసీఐ బుధవారం టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా విండీస్‌తో సిరీస్‌కు ఆడబోయే టీమిండియా జట్టును ట్విటర్‌లో షేర్ చేశాడు. ముందుగా ఊహించినట్లుగానే ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. టి20ల్లో కెప్టెన్‌గా సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యాకే బీసీసీఐ మరోసారి అవకాశమిచ్చింది.
మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఊహించినట్లుగానే ఐపీఎల్ హీరోలకు బీసీసీఐ పెద్దపీట వేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సహా సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయి, ముఖేశ్ కుమార్‌లకు అవకాశమిచ్చారు. ఇక పేస్ బౌలింగ్ దళాన్ని అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్‌లు నడిపించనున్నారు.
స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయిలు చోటు దక్కించుకున్నారు. ఇక రెగ్యులర్ ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లు ఎంపికవగా.. వారికి బ్యాకప్‌గా యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేశారు. ఇక మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, కెప్టెన్ పాండ్యాలు బాధ్యతలు పంచుకోనున్నారు.
ఇక టీమిండియా-వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆగస్టు 3 నుంచి 13 వరకు జరగనుంది. తొలి టి20 ఆగస్టు 3న ట్రినిడాడ్ వేదికగా, రెండో టి20(ఆగస్టు 6న), మూడో టి20(ఆగస్టు 8న) గయానా వేదికగా, నాలుగో టి20(ఆగస్టు 12న), చివరి టి20(ఆగస్టు 13న) ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి.
కాగా ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కు సంబంధించిన జట్లను ప్రకటించారు. రోహిత్ సారధ్యంలోని జట్టు వెస్టిండీస్‌కు చేరుకొని తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. మొదట రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది.
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: విండీస్ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం
Comments
Please login to add a commentAdd a comment