Ind Vs Ban: KL Rahul Brilliant Run-Out Of Bangladesh Batter Litton Das Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs BAN: పిచ్‌పై పచ్చిక.. బంగ్లా ఓపెనర్‌ కొంపముంచింది

Published Wed, Nov 2 2022 5:35 PM | Last Updated on Wed, Nov 2 2022 6:40 PM

KL Rahul Brilliant Run-out Bangladesh Batter Litton Das Viral - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ రనౌట్‌ సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. కేఎల్‌ రాహుల్‌ వేసిన బులెట్‌ త్రోకు లిటన్‌ దాస్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే లిటన్‌ దాస్‌ రనౌట్‌కు పరోక్షంగా కారణమయింది మాత్రం మరో ఓపెనర్‌ నజీముల్‌ హొస్సేన్‌ షాంటో అయితే ప్రత్యక్షంగా మాత్రం పిచ్‌పై ఉన్న పచ్చిక. వర్షం అనంతరం మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన తొలి ఓవర్‌ను అశ్విన్‌ వేశాడు.

ఆ ఓవర్‌ రెండో బంతిని షాంటో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడాడు. సింగిల్‌ పూర్తి చేసి రెండో పరుగు కోసం షాంటో ప్రయత్నించగా.. లిటన్‌ దాస్‌ మాత్రం​రెండో పరుగు వద్దనుకున్నాడు. కానీ షాంటో వేగంగా పరిగెత్తడంతో లిటన్‌ దాస్‌ రెండు పరుగుకు వచ్చాడు. అయితే క్రీజుపై కాస్త పచ్చిక ఉండడంతో జారిన లిటన్‌ మరింత స్లో అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేఎల్‌ మెరుపు వేగంతో త్రో వేయగా  నేరుగా  వికెట్లను గిరాటేయడంతో డైరెక్ట్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే పెవిలియన్‌ వెళ్తూ తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement