వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, కేఎల్ రాహుల్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడి టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుంది. ఈ సమయంలో కేఎల్ రాహుల్ రనౌట్ అవ్వడం మ్యాచ్ ఫ్లోను దెబ్బతీసింది. సూర్యతో సమన్వయలోపం వల్లే రాహుల్ ఔటయ్యాడని అంతా భావించారు.
తాజాగా సూర్యకుమార్.. కేఎల్ రాహుల్ రనౌట్‌పై స్పందించాడు. ''మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రనౌట్ అవ్వడం దురదృష్టం. కానీ అందులో నా తప్పేం లేదు. అయితే కేఎల్ రాహుల్ తన రనౌట్ విషయంలో ఇషాన్ కిషన్ ద్వారా నాకు సమాచారం పంపాడు. డ్రింక్స్‌బ్రేక్ సమయంలో ఇషాన్ నా దగ్గరకు వచ్చి రాహుల్ పంపిన మెసేజ్ ఇచ్చాడు. అది నీ తప్పిదం కాదు.. నో.. నో అంటూ వేరేవాళ్లు అన్న వాయిస్‌ను వినబడి మధ్యలో ఆగిపోయా. అంతేకానీ నీతో సమన్వయలోపం వల్ల కాదు. బాధపడకు.. నీ ఆట నువ్వు ఆడు అని మెసేజ్‌లో ఉందని'' చెప్పుకొచ్చాడు.
చదవండి: KL Rahul: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్
ఇక రాహుల్ రనౌట్ అయిన విధానం చూసుకుంటే.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని కేఎల్ రాహుల్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ ఈజీగా వస్తుంది.. కానీ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్య కూడా వేగంగా స్పందించడంతో రాహుల్ పరిగెత్తాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయాడు. అంతే అకియెల్ హొసేన్ వేసిన బంతిని అందుకున్న కీపర్ హోప్ వికెట్లను గిరాటేశాడు. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయలోపం అనుకుందామనుకున్నా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ కాల్‌కు సూర్య సరిగ్గానే స్పందించాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన రాహుల్ రెండు సెకన్లు ఆగిపోయాడు. అలా కేఎల్ రాహుల్ 49 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
చదవండి: IND Vs WI: కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే..
Village Cricket pic.twitter.com/Q3GvS4UUmv
— Stone Cold (@StoneCo06301258) February 9, 2022
Comments
Please login to add a commentAdd a comment