India tour of West Indies, 2023: ‘‘నిజానికి ఇషాన్ కిషన్ నంబర్ 4లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే అతడికి వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కింది. రెండో ప్రధాన కీపర్‌గా అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి మిడిలార్డర్‌లో ఆడిస్తే బాగుండేది. తొలి వన్డేలో అతడిని ఓపెనర్‌గా దింపారు.
ఫిఫ్టీ చేయడం గొప్పేమీ కాదు
హాఫ్ సెంచరీ సాధించాడు. బాగానే ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన వాడు ఈ మాత్రం స్కోర్ చేయడం గొప్పేం కాదు. వాస్తవానికి.. సంజూ శాంసన్ లేదంటే ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఎవరికి అవకాశం ఇస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
సూర్య ఇలా వచ్చి అలా!
కాబట్టి వికెట్ కీపర్‌గా ఇషాన్‌ను ఆడించినపుడు ఓపెనర్‌గా పంపడమెందుకో అర్థం కాలేదు. ఓపెనింగ్ స్థానంలో అతడు 50 చేసినా అదేమంత గొప్ప విషయం కానేకాదు. ఎందుకంటే ఇప్పటికే ఓపెనర్‌గా ఇషాన్ తనను తాను నిరూపించుకున్నాడు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో సంజూ శాంసన్‌ను కాదని ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల కొత్తగా ఒరిగిందేమీ లేదన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడంపై ఈ మాజీ ఓపెనర్ స్పందిస్తూ.. ‘‘పర్లేదు.. తన బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ అతడు అవుటైన విధానం అస్సలు నచ్చలేదు.
తొలుత స్వీప్ షాట్‌తో ఫోర్.. మళ్లీ స్వీప్ షాట్.. ఆపై మరో స్వీప్.. తర్వాత కూడా అదే తీరు.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు! ఒకే తరహాలో నాలుగు షాట్లు ఆడి అలా వెళ్లిపోయాడు’’ అంటూ పెదవి విరిచాడు. కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బార్బడోస్‌లో టీమిండియా జయభేరి మోగించిన విషయం తెలిసిందే.
గిల్ మరోసారి విఫలం
ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించాడు. టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచి 5 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ రాకతో కేరళ బ్యాటర్ సంజూకు జట్టులో చోటు కరువు కాగా.. రెగ్యులర్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం విశేషం.
ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయోగం చేసిన తీరుపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టుల్లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక సూర్య 19, హార్దిక్ పాండ్యా 5, రవీంద్ర జడేజా 16(నాటౌట్), శార్దూల్ ఠాకూర్(1), రోహిత్ శర్మ 12(నాటౌట్) పరుగులు సాధించారు. ఇక విండీస్- భారత్ మధ్య శనివారం రెండో వన్డే బార్బడోస్‌లో జరుగనుంది.
చదవండి: యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
అస్సలు ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment