
కోల్‌కతా: ఇటీవల భారత్‌తో జరిగిన చివరివన్డేలో 104 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నమోదు చేసిన వెస్టిండీస్ మరో అపప్రథన మూటగట్టుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. ఫలితంగా టీ20ల్లో భారత్‌పై అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. 2014లో భారత్‌పై 129 పరుగులు చేసిన విండీస్.. తాజాగా దాన్ని సవరించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్‌లో శుభారంభం చేసింది.
అంతకముందు భారత్‌తో జరిగిన ఐదో వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాడటంలో విఫలం కావడంతో విండీస్ 104 పరుగులకే ఆలౌటైంది. తద్వారా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్‌పై వన్డేల్లో విండీస్‌కు అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఆ వన్డే జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే విండీస్ మరోసారి తడ‘బ్యాటు’కు గురై చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం.
ఇక్కడ చదవండి: ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్