వెస్టిండీస్‌తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని ఉపయోగించుకోనుంది. కాగా తుది జట్టు ఎలా ఉండబోతుందో ముందే అంచనాకు వచ్చినప్పటికి వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్‌వైపే మొగ్గుచూపాడు. ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ ఫిఫ్టీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఇషాన్‌కు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.
రెండో టెస్టులో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్‌లు పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ హార్దిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా జడేజా మరో స్పిన్నర్‌గా ఉన్నాడు.
టెస్టు సిరీస్ ఓడినప్పటికి వెస్టిండీస్ వన్డే జట్టు మాత్రం కాస్త సీనియర్లతో నిండిఉంది. ఇటీవలే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో రాణించిన కెప్టెన్ షెయ్ హోప్ సహా కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, డొమినిక్ డ్రేక్స్ , షిమ్రోన్ హెట్‌మైర్, రోవ్‌మెన్ పావెల్‌లు జట్టులో ఉన్నారు.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్
India vs West Indies, 1st ODI: India Opt To Field vs West Indies, Mukesh Kumar To Debut#INDvsWI #ODIs #BCCI #Cricket #debu pic.twitter.com/pTx9hbPji4
— Smart Locus (@SmartLocusIN) July 27, 2023
చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించాడు!
Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
Comments
Please login to add a commentAdd a comment