నయా రన్‌ మెషీన్‌ షాయ్‌ హోప్‌.. దిగ్గజాల సరసన చోటు | CWC Qualifiers 2023: Shai Hope Enters Rare Group Of Virat, Bevan, ABD, Dhoni, Root | Sakshi
Sakshi News home page

CWC Qualifiers 2023: నయా రన్‌ మెషీన్‌ షాయ్‌ హోప్‌.. విరాట్‌, ధోని, ఏబీడీ సరసన చోటు

Published Thu, Jun 22 2023 8:04 PM | Last Updated on Thu, Jun 22 2023 8:04 PM

CWC Qualifiers 2023: Shai Hope Enters Rare Group Of Virat, Bevan, ABD, Dhoni, Root - Sakshi

వెస్టిండీస్‌ వన్డే జట్టు కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ అత్యంత అరుదైన జాబితాలో చేరాడు. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్‌ 22) జరుగుతున్న మ్యాచ్‌లో శతక్కొట్టం (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు)  ద్వారా విరాట్‌ కోహ్లి, మైఖేల్‌ బెవాన్‌, ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్‌ ధోని, జో రూట్‌ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు.

నేపాల్‌తో మ్యాచ్‌లో  సెంచరీ చేయడం ద్వారా హోప్‌ మరోసారి వన్డేల్లో 50కిపైగా యావరేజ్‌ సాధించాడు. కనీసం 100 వన్డేలు ఆడి 50 అంతకంటే ఎక్కువ సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో పైన పేర్కొన్న దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. హోప్‌ 110 మ్యాచ్‌ల్లో 105 ఇన్నింగ్స్‌లు ఆడి 50.26 సగటున 4674 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్‌ అందరికంటే ఎక్కువగా 274 వన్డేల్లో 57.3 సగటున 12898 పరుగులు చేశాడు.

విరాట్‌ తర్వాత ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బెవాన్‌ (232 వన్డేల్లో 53.6 సగటున 6912 పరుగులు) అత్యధిక సగటు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్‌ (228 వన్డేల్లో 53.5 సగటున 9577 పరుగులు), ఎంఎస్‌ ధోని (350 మ్యాచ్‌ల్లో 50.6 సగటున 10773 పరుగులు), జో రూట్‌ (158 వన్డేల్లో 50 సగటున 6207 పరుగులు) ఉన్నారు. తాజాగా హోప్‌ వీరి సరసన చేరాడు. 

నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టడం ద్వారా హోప్‌ వన్డేల్లో తన 15వ శతకాన్ని నమోదు చేశాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు), హోప్‌ అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్‌ సెంచరీలు (18) చేసిన రెండో బ్యాటర్‌గా హోప్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవలికాలంలో హోప్‌ ప్రదర్శన చూసాక ఇతన్ని అందరూ నయా రన్‌ మెషీన్‌ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే, నేపాల్‌తో మ్యాచ్‌లో హోప్‌తో పాటు నికోలస్‌ పూరన్‌ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం​ ఛేదనలో నేపాల్‌ తడబడుతుంది. 44 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement