7 ఏళ్లకే బ్యాటింగ్‌ ఇరగదీస్తోంది.. | 7 Years Indian Girl Wows With Batting | Sakshi
Sakshi News home page

7 ఏళ్లకే బ్యాటింగ్‌ ఇరగదీస్తోంది..

Published Thu, Apr 23 2020 10:36 AM | Last Updated on Thu, Apr 23 2020 11:00 AM

7 Years Indian Girl Wows With Batting - Sakshi

ముంబై: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో క్రికెట్‌ను మతంలా భావిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. క్రికెట్‌ క్రీడలో ఆటగాళ్లు రాణిస్తే  ఆకాశానికెత్తేసే అభిమానులు.. అదే క్రికెటర్ల నుంచి పేలవమైన ఆటను చూడాల్సి వస్తే ఇక భరించలేరు.తమ నోటికి ఏ స్థాయిలో పని చెబుతారో తెలియని విషయం కాదు. భారత్‌లో గల్లీ క్రికెట్‌ బాగా ఫేమస్‌. ఖాళీ దొరికితే చాలు క్రికెట్‌ బ్యాట్‌ పుచ్చుకుని గల్లీల్లో క్రికెట్‌ ఆడేస్తూ ఉంటారు. అది ఇళ్లా.. లేక వీధా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. (ఇప్పట్లో క్రికెట్‌ కష్టమే)

కొన్ని నెలల క్రితం రెండేళ్ల బుడతడు ఇంట్లోనే అచ్చమైన క్రికెట్‌ షాట్లతో మైమరించిన సంగతి తెలిసిందే.ఇంటినే క్రికెట్‌ స్టేడియంగా చేసుకుని కవర్‌ డ్రైవ్‌, లాఫ్టెడ్‌, ఆన్‌ డ్రైవ్‌ షాట్లతో సచిన్‌ను గుర్తు చేసేశాడు. ఇప్పుడు ఏడేళ్ల బాలిక క్రికెట్‌ బ్యాట్‌కు పని చెప్పింది. కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లను బాదేసింది. బంతుల్ని ఆడే క్రమంలో తన టైమింగ్‌ ఇరగదీసింది. 

భారత్‌కు చెందిన ఈ బాలిక పేరు పారీ శర్మ.  ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తో పాటు వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ కూడా ముగ్దుడయ్యాడు. ‘ ప్యారీ శర్మ బ్యాటింగ్‌ స్కిల్స్‌ అమోఘం. ఇంతటి చిన్న వయసులో కచ్చితమైన ఫుట్‌వర్క్‌ అసాధారణ విషయం. ఈ వీడియోలో ఏడేళ్ల పారీ శర్మ పాదాలను పాదరసంలా కదుపుతోంది’ అని ట్వీట్‌ చేయగా, ‘ నేను పారీలా ఆడుతూ పెరిగాను’ అని షాయ్‌ హోప్‌ ట్వీట్‌ చేశాడు. (కపిల్‌ దేవ్‌ గుండు.. ఆమే కారణం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement