PC: IPL.com
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్‌కు పయనం కానుంది. లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కంటే కేఎల్‌రాహుల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మైఖల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు.
దీంతో అతడిని ఆఖరి రెండు టెస్టులకు జట్టును తప్పించారు. ఈ క్రమంలో రాహుల్‌కు ఇక టెస్టు భవిష్యత్తు కష్టమనేని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ సెలక్టర్లు రాహుల్‌పై మరోసారి నమ్మకం ఉంచారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో రాహుల్‌కు చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో మైఖల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "శుబ్‌మన్ గిల్ అద్భుతమైన యంగ్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంగ్లండ్ వంటి పరిస్ధితుల్లో గిల్ కంటే రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో నేను కొన్ని లోపాలను గమనించాను. అందుకే గిల్ కంటే రాహుల్ బెటర్ అని భావిస్తున్నాను.
కాగా ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే. కాబట్టి పాత చరిత్రను చూడకుండా రాహల్‌కు అవకాశం ఇవ్వండి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవాలంటే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడం ముఖ్యం. కావలంటే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో మార్పులు చేయవచ్చు" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023 PBKS Vs LSG: హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment