West Indies Beat UAE By 7 Wickets In 1st ODI - Sakshi
Sakshi News home page

UAE VS WI 1st ODI: పసికూనపై విండీస్‌ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్‌

Published Mon, Jun 5 2023 7:57 AM | Last Updated on Mon, Jun 5 2023 9:06 AM

West Indies Beat UAE In First ODI - Sakshi

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం యూఏఈలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ జట్టు షార్జా వేదికగా నిన్న (జూన్‌ 4) జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి, సిరీస్‌కు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 47.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా.. విండీస్‌ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

బ్రాండన్‌ కింగ్‌ సూపర్‌ శతకం (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి విండీస్‌ను గెలిపించాడు. అతనికి షామార్‌ బ్రూక్స్‌ (58 బంతుల్లో 44; 5 ఫోర్లు) జత కలిశాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీ నసీర్‌ (58), అరవింద్‌ (40) రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో కీమో పాల్‌ 3, డొమినిక్‌ డ్రేక్స్‌, ఓడియన్‌ స్మిత్‌, కారియా తలో 2 వికెట్లు, రోస్టన్‌ ఛేజ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్‌ 6న షార్జాలోనే జరుగనుంది.

చదవండి: గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement