భారత్ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్-2023కు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు బ్రాండెన్ కింగ్ సారధ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్ కీమో పాల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కపోవడం గమానార్హం.
ఇక వరల్డ్‌కప్ క్వాలిఫియర్ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్‌కు కూడా జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2023లో భాగంగా ఉన్న విండీస్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభసమయానికి ఐపీఎల్ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్
యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్
Comments
Please login to add a commentAdd a comment