స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (అక్టోబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ చాలాకాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. హెట్‌మైర్ 2023 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పైనే తన చివరి వన్డే ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి హెట్‌మైర్ వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
అలిక్ అథనాజ్ స్థానంలో హెట్‌మైర్ జట్టులోకి వచ్చాడు. విండీస్ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన జట్టునే యధాతథంగా (ఒక్క మార్పు) కొనసాగించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విండీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును కూడా నిన్ననే ప్రకటించారు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు..
షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటి, జేడెన్ సీల్స్, రోమారియో షెఫర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్
విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు..
లియామ్ లివింగ్‌స్టోన్ (కెప్టెన్), విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, డాన్ మౌస్లీ, జాకబ్ బేతెల్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, మైఖేల్ కైల్ పెప్పర్, జాఫర్ చొహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్
షెడ్యూల్
అక్టోబర్ 31- తొలి వన్డే (ఆంటిగ్వా)
నవంబర్ 2- రెండో వన్డే (ఆంటిగ్వా)
నవంబర్ 6- మూడో వన్డే (బార్బడోస్)
నవంబర్ 9- తొలి టీ20 (బార్బడోస్)
నవంబర్ 10- రెండో టీ20 (బార్బడోస్)
నవంబర్ 14- మూడో టీ20 (సెయింట్ లూసియా)
నవంబర్ 16- నాలుగో టీ20 (సెయింట్ లూసియా)
నవంబర్ 17- ఐదో టీ20 (సెయింట్ లూసియా)
Comments
Please login to add a commentAdd a comment