Keemo Paul
-
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్
భారత్ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్-2023కు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బ్రాండెన్ కింగ్ సారధ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్ కీమో పాల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కపోవడం గమానార్హం. ఇక వరల్డ్‌కప్ క్వాలిఫియర్ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్‌కు కూడా జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2023లో భాగంగా ఉన్న విండీస్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభసమయానికి ఐపీఎల్ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్ -
ఆసిఫ్.. ఇంత కోపం పనికిరాదు
-
'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలివెళ్లు'
జమైకా : కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్ 2020) బుధవారం జమైకా తలైవాస్, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి ఆసిఫ్..'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు..' అంటూ కీమో పాల్ సైగ చేశాడు. అప్పటికే ఔట్ అయ్యాననే కోపంలో ఉన్న ఆసిఫ్ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే ఆసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్ కోపంతో ఆసిఫ్ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫ్ అలీకి చేసిన పనికి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద జరిమానాతో విధించే అవకాశం ఉంది. చదవండి : కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం మ్యాచ్‌లోనూ మాస్క్.. కీమో పాల్ వీడియో వైరల్ -
మాస్క్‌తో సంబరం.. కీమో పాల్ వీడియో వైరల్
క్రికెట్ మైదానంలో ఒక్కో ఆటగాడికి ఒక్కోలా ప్రవర్తిసాడు. ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తించి అభిమానులను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వెస్టిండిస్ బౌలర్లు మైదానంతో తమదైన శైలీని ప్రదర్శించి మీడియాను ఆకర్షిస్తారు. వికెట్లు తీసిన తర్వాత మైదానంలో వారు జరుపుకునే సంబరాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. షెల్డన్ కాట్రెల్ మార్చ్ సెల్యూట్ మొదలు.. కేస్రిక్ విలియమ్స్ నోట్‌బుక్ టిక్ వరకు ఒక్కొక్కొరు ఒక్కో స్టైల్లో సంబరాలు జరుపుకుంటారు. ఇప్పుడు వారి సరనన కీమో పాల్ కూడా చేరాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)మొదటి మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతరం పాల్ ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది. వికెట్ తీసిన ఆనందంలోనూ కోవిడ్ నిబంధనలు పాటించి క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు. అసలు ఏం జరిగిదంటే.. క్రికెట్లో బౌలర్ వికెట్ తీయగానే ఫీల్డర్లు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేస్తారు. ఒక్కోసారి బౌలర్‌ను ఎత్తుకొని చిందులేస్తారు. ఇవన్ని ఒకప్పుడు సర్వసాధారణం కానీ ఇప్పుడు కాదు. ఇది కరోనా కాలం. ఈ సమయంలో మనుషుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సామాజిక దూరం పాటిస్తే తన ఆరోగ్యంతో పాటు ఇతరులు ఆరోగ్యం కూడా కాపాడినవాళ్లం అవుతాం. సరిగ్గా ఇదే పని చేశాడు వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్. బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మరియు గయానా అమెజాన్ వారియర్స్ మధ్య తొలి సీపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. గయానా జట్టు తరుపున బౌలింగ్ చేసిన కీమో పాల్.. ఏడో ఓవర్లో కీలక వికెట్ తీశాడు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు పాల్‌ను అభినందించేందుకు వచ్చారు. అయితే వారిని దగ్గరకు రావద్దని సైగలు చేస్తూ మాస్క్ ధరించిన దూరంగా వెళ్లాడు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రకంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన యొక్క వీడియోను సీసీఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది, అక్కడ అభిమానులు సురక్షితంగా ఉండమని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి : ధోని కంటతడి పెట్టాడు!) కాగా, బుధవారం జరిగిన సీపీఎల్ తొలి మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ బోణీ కొట్టింది. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెయాడ్ ఎమ్రిట్ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. MASK ON! Keemo knows the drill! #StaySafe #CPL20 pic.twitter.com/pkABEf472p — CPL T20 (@CPL) August 19, 2020 -
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లలేం
సెయింట్ జాన్స్: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్ ఆటగాళ్లు డారెన్ బ్రేవో, షిమ్రోన్ హెట్‌మైర్, కీమో పాల్ వెల్లడించారు. దాంతో ఈ సిరీస్ కోసం ఈ ముగ్గురి పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా 14 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఎన్క్రుమా బోనెర్, పేస్ బౌలర్ చెమర్ హోల్డర్ తొలిసారి విండీస్ టెస్టు జట్టులోకి వచ్చారు. బయో–సెక్యూర్ పరిస్థితుల నడుమ నిర్వహించే ఈ సిరీస్ కోసం ఎంపికైన ఆటగాళ్లందరికీ కోవిడ్–19 టెస్టులు చేస్తారు. అనంతరం జూన్ 8న చార్టెర్డ్ ఫ్లయిట్లో విండీస్ క్రికెటర్లు ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు. తొలి టెస్టును హాంప్‌షైర్‌లో జూలై 8 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. అనంతరం రెండో టెస్టు జూలై 16 నుంచి 20 వరకు... మూడో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరుగుతాయి. విండీస్ టెస్టు జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, షై హోప్, డౌరిచ్, రోస్టన్ చేజ్, షెమారా బ్రూక్స్, రఖీమ్ కార్న్‌వాల్, ఎన్క్రుమా బోనెర్, అల్జారి జోసెఫ్, చెమర్ హోల్డర్, జాన్ క్యాంప్‌బెల్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్. -
విండీస్‌కు ఎదురుదెబ్బ
ఆంటిగ్వా: టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్‌కు టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ ఆల్ రౌండర్ కీమో పాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ చీలమండ గాయంతో పాల్ తొలి టెస్టు నుంచి వైదొలిగినట్లు విండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కీమో పాల్‌ను జట్టుతో పాటే కొనసాగిస్తున్న విండీస్.. రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది. కాగా, తొలి టెస్టులో పాల్ స్థానంలో మరొక ఫాస్ట్ బౌలర్ మిగుల్ కమిన్స్‌కు చోటు కల్పించింది. ఈ విషయాన్ని విండీస్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ గాయం కారణంగా కీమో పాల్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానాన్ని మిగుల్ కమిన్స్ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాం. భారత్-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో కమిన్స ఆకట్టుకున్నాడు. మరొకవైపు నెట్స్‌లో కూడా ఎంతో పరిణిత కనబరిచాడు’ అని తెలిపింది. మూడేళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కమిన్స్ అరంగేట్రం చేశాడు. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కమిన్స్ 9 వికెట్లు సాధించాడు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ఇదే అతని కెరీర్ అత్యుత్తమం. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ రోజు తొలి టెస్టు ఆరంభం కానుంది. -
ఐపీఎల్ 12; కుర్రాళ్లు కుమ్మేశారు!
సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్–12లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటారు. 21 సంవత్సరాలు, అంత కన్నా తక్కువ వయసున్న నలుగురు ఆటగాళ్లు మ్యాచ్‌లో కీలక ప్రదర్శన చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డీసీ విజయం సాధించడంలో ఇద్దరు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ కీలక భూమిక పోషించారు. ఆరంభంలో పృథ్వీ షా అర్ధసెంచరీతో అదరగొట్టగా, చివరల్లో పంత్ మెరుపులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్‌లో 21 ఏళ్ల విండీస్ టీనేజర్ కీమో పాల్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. ఈ నలుగురిలో అందరి కంటే చిన్నవాడైన పృథ్వీ షా(19) ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడి 348 పరుగులు సాధించాడు. పంత్(21) 15 మ్యాచ్‌ల్లో 450 పరుగులు చేశాడు. కీమో పాల్ 7 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు దక్కించుకున్నాడు. 20 ఏళ్ల వయసున్న రషీద్ ఖాన్ 15 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు నేలకూల్చాడు. ఈ నలుగురిలో ఎవరు స్టార్ ఫెర్ఫార్మర్ అంటూ ఐసీసీ కూడా ట్వీట్ చేసింది. (చదవండి: సన్‌పోరు సమాప్తం)