
సాగర్/దామోహ్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ వంటి బూటకపు హామీలతో దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశంలో నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఎలా ఉన్నారో మీకు తెలుసా? దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ, సామాన్యులను ‘మిత్రులారా!’ అని సంబోధిస్తారు. కానీ ప్రజల సొమ్ముతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులను ‘భాయీ (సోదరా!)’ అని పిలుస్తారు. పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరుందని తాను చెప్పగానే శివరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించటాన్ని బట్టి, ఈ వ్యవహారంలో వాస్తవం మరేదో ఉందని అనిపిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment