betrayed
-
బాబు బాగా ‘వరెస్టు’.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం..
మంచి చేయలేరు.. ఎదుటివారు చేస్తున్న మంచిని ఓర్చుకోలేరు. తాను పుట్టిన గడ్డకు కనీస న్యాయం చేయకపోగా, తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. రాయలసీమకు ఘనమైన చరిత్ర ఉంది. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి దుష్ప్రచారం చేయించిన ఘనుడు చంద్రబాబు.. ఆయన దిగజారుడు రాజకీయాలను కాస్త లోతుకెళ్లి పరిశీలిస్తే.. కరువు సీమ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. బాబు ఆదేశాల మేరకు, టీడీపీ దేవినేని ఉమ చౌదరి, కోడెల చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి రాయలసీమకు వైఎస్ జలాన్ని దోపిడీ చేస్తున్నారని ఆందోళన చేశారు. కర్నూలుకు కొంచెం అయినా న్యాయం చేయండి అని బాబును అడిగితే కర్నూల్లో టీడీపీని 3 చోట్ల మాత్రమే గెలిపించారు నేనేందుకు చేయాలంటూ ముఖ్యమంత్రి బాబు అంటున్నాడంటూ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి రెండు సార్లు మీడియా ముందు చెప్పాడు. మద్రాస్‌లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో 10 వేల ఉద్యోగాలు కల్పించే హెచ్‌సీఎల్ ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంగా ప్రకటించారు. శివనాడార్‌పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేశాడు. కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో కెల్లా పెద్దది ఏఐఐఎంస్. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సి ఉంటే ఏఐఐఎంస్(All India Institute of Medical Sciences)ను సొంత కులస్థులు ఉన్న విజయవాడ గుంటూరుకు తరలించాడు. చదవండి: చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా? శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్లు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు.. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ రాజధానికి సరైన ప్రాంతమని భావించింది. కానీ చంద్రబాబు దొనకొండలో రెడ్లు ఎక్కువగా ఉన్నారని, సొంత కులస్తులు ఉన్న విజయవాడ–గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేశాడు. కాపు గర్జన అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అంటూ అవమానం చేశాడు బాబు.. కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా కాపులను.. బాబు ఆదేశాల మేరకు సొంత కులస్థులు తీసే సినిమాల్లో రాయలసీమ అంటే ఏహ్య భావం కలిగేలా చూపుతారు. కమ్మ వాళ్లను జమిందార్లుగా స్వాతంత్ర సమర యోధుల్లాగా చూపిస్తూ.. రెడ్లను యాదవులని విలన్లుగా బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ని జోకర్లుగా చూపుతారు చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? రాయలసీమలో ఉన్న శ్రీ సిటీని 2008లో ఆనాడు వైఎస్సార్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీలో పరిశ్రమల కేంద్రంగా ఉంది. నేడు శ్రీసిటీ లాగా.. కడప జిల్లా కొప్పర్తిని సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. -
చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ ఆయన మాత్రం..
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలసిందే. ఇక ఈ రాజకీయ పోరులో విజయం కోసం ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా శివసేన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివసేనను అంతం చేయడానికి కుట్ర పన్నడం ద్వారా బాలాసాహెబ్ (బాల్ ఠాక్రే)కు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలకు వారు కూడా బాలాసాహెబ్‌కు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే కారణమని శివసేనలో అందరూ భావిస్తున్నారని, అది నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సావంత్ అన్నారు. ‘‘2002 గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ బాలాసాహెబ్ వాజ్‌పేయిని అలా చేయవద్దని ఒప్పించారు. 'అగర్ మోడీ గయా, పార్టీ గయీ.' (మోడీ పోతే, బీజేపీగుజరాత్‌ను కోల్పోతుంది) అని వాజ్‌పేయికి నచ్చజెప్పారు. బాలాసాహెబ్ తన చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ మోదీ మాత్రం బాలాసాహెబ్‌ని మోసం చేశారని’’ సావంత్ అన్నారు. ప్రధాని కేబినెట్లో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు కేంద్ర మంత్రిగా పనిచేసిన సావంత్, 2019లో సేన-బీజేపీ పొత్తు ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: Maharashtra: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? -
తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో వేటుకు గురైన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అంటున్నారాయన. ‘‘నేనేం తప్పు చేయలేదు. విశాల్ సింగ్ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది. అర్ధరాత్రి 12 దాకా మేం నివేదికను రూపొందించాం. విశాల్ చేసే కుట్రను కనిపెట్టలేకపోయా. చాలా బాధగా అనిపించింది. సర్వే గురించి ఎలాంటి సమాచారం నేను బయటపెట్టలేదు’’ అని అడ్వొకేట్ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కమిటీ సర్వే కొనసాగుతున్న టైంలోనే లీకులు అందించారంటూ వారణాసి కోర్టు మంగళవారం అర్ధాంతరంగా అజయ్ మిశ్రాను తప్పించి.. ఆ స్థానంలో విశాల్ సింగ్‌ను కొత్త అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించింది. అజయ్ మిశ్రా మీద ఫిర్యాదు చేసిందే విశాల్ సింగ్ కావడం విశేషం. ‘‘అజయ్ మిశ్రా ప్రవర్తన మీద పిటిషన్ దాఖలు చేశా. ఆయన ఓ వీడియోగ్రాఫర్ నియమించుకుని.. అతనితో మీడియాకు లీకులు ఇచ్చారు. పుకార్లు ప్రచారం చేశారు. నేను నా బాధ్యతగా నా నివేదిక సమర్పించా’’ అని పేర్కొన్నారు విశాల్ సింగ్. ఇదిలా ఉంటే.. వీడియోగ్రాఫర్ చేసిన తప్పిదానికి తానేం చేయగలనుంటున్నాడు అజయ్ మిశ్రా. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందని హిందూ వర్గం, కాదు.. అది కొలనుకు సంబంధించిన భాగం అని మసీద్ నిర్వాహక కమిటీ వాదిస్తున్నారు. ఇక సర్వే కమిటీ మరో రెండురోజుల్లో వారణాసి కోర్టులో తన నివేదికను సమర్పించనుంది. Gyanvapi Mosque Case: లీకులు చేసినందుకే అడ్వొకేట్ కమిషనర్ తొలగింపు! -
నమ్మించాడు.. ఉడాయించాడు!
సాక్షి, సత్యనారాయణపురం (విజయవాడ): నమ్మి ఐదు లక్షల విలువైన సరుకు పంపిస్తే గుట్టుచప్పుడు కాకుండా దుకాణం మూసివేసి యజమాని పరారైన సంఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు వీధికి చెందిన గోపరాజు వెంకట శంకర్ కేసరీ పుడ్ ఫీడ్స్ పేరిట మొక్కజొన్నలు, వంట నూనెలు విక్రయిస్తుం టాడు. ఆయనకు 2016లో రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో రాకేశ్‌కు గాయత్రినగర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఉన్న రక్షా ఇన్‌ఫ్యాక్ట్స్ దుకాణానికి సరుకును పంపించమన్నాడు. ఆదిలో వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగినా తర్వాతి కాలంలో 5 లక్షల విలువైన సరుకు పంపించగా అందుకు సంబందించిన ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిచిపోయాయి. ఈమేరకు డబ్బును వెంకట శంకర్ అడుగుతుండగా రాకేశ్‌రెడ్డి వాయిదా వేస్తూ వ చ్చాడు. ఈక్రమంలో వెంకట శంకర్‌కు పలువురు దుకాణం నడవడం లేదని, రాకేశ్ కని పించడం లేదని చెప్పడంతో పరిశీలించి చూడగా దుకాణం మూసివేసి పరారయ్యాడని గమనించాడు. దీంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మోదీ మోసం చేశారు: రాహుల్
సాగర్/దామోహ్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ వంటి బూటకపు హామీలతో దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశంలో నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఎలా ఉన్నారో మీకు తెలుసా? దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ, సామాన్యులను ‘మిత్రులారా!’ అని సంబోధిస్తారు. కానీ ప్రజల సొమ్ముతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులను ‘భాయీ (సోదరా!)’ అని పిలుస్తారు. పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరుందని తాను చెప్పగానే శివరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించటాన్ని బట్టి, ఈ వ్యవహారంలో వాస్తవం మరేదో ఉందని అనిపిస్తోందన్నారు. -
తలైవాకి వెన్నుపోటు తప్పదు!
సాక్షి, బెంగళూర్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ.. కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్ అమ్మునై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్.. తలైవాకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏ మాత్రం లేదని తేల్చేశారు. ‘‘రజనీకాంత్ ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్ఛితంగా రాణించగలరు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవటం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఆయన ఆశలు పెట్టుకోకపోవటమే మంచింది. ఆయన కింగ్ మేకర్ అవుతారే తప్ప.. కింగ్(సీఎం) కాలేరు’’ అని ప్రకాష్ ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సొంతవాళ్లే వెన్నుపోటే ప్రమాదం పొంచి ఉందని.. కాబట్టి రజనీ రాజకీయాలపరంగా ఎవరినీ నమ్మకపోవటమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. మకర రాశి, సింహ లగ్నంలో జన్మించిన రజనీకాంత్‌కు రాజకీయాల్లో అడ్డు ఉండబోదని ప్రకాష్ అన్నారు. రజనీకి పెటా విజ్ఞప్తి పెటా ఇండియా శుక్రవారం రజనీకాంత్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. అభిమానంతో పేరిట మీ ఫ్యాన్స్ జంతువులను బలులు ఇస్తున్నారని.. ఆ చర్యలను అడ్డుకునేలా అభిమానులకు రజనీ పిలుపు ఇవ్వాలని పెటా కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసిన పెటా.. రాజకీయ ప్రవేశంపై రజనీకి అభినందనలు కూడా తెలియజేసింది. After @superstarrajini fans announced plans to slaughter goats in his name, PETA sent the superstar an urgent plea calling on him to stop them. Find out how you, too, can help spare these goats' lives: https://t.co/sLLdvywZf5 https://t.co/EhzW91jmnU — PETA India (@PetaIndia) 5 January 2018 -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
–రూ.18.91 లక్షలు, ప్రింటర్ స్వాధీనం –నిందితులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే –వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంగోపాల్‌రావు మిర్యాలగూడ అర్బన్ దొంగనోట్లను ప్రింట్ చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 18.91 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంగోపాల్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలం, కండ్లకుంట గ్రామానికి చెందిన సుదెనబోయిన అమరయ్య రెండు నెలల క్రితం విజయవాడలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద కలర్ ప్రింటర్, కటింగ్‌మిషన్ కొనుగోలు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు దొడ్డామార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డిలతో పాటు వెల్ధుర్తి మండలం గంగలకుంటకు చెందిన బత్తుల శ్రీరాములు ముఠాగా ఏర్పడ్డారు. గ్రామంలో దొంగనోట్లు ముద్రిస్తే అందరికీ తెలస్తుందని, ప్రస్తుతం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామంలో నివాసముంటున్న గుంటూరు జిల్లా కండ్లకుంట గ్రామానికి చెందిన చెన్నుపల్లి యశోద వద్దకు చేరుకున్నారు. కొంతకాలంగా ఆమె ఇంట్లోనే దొంగనోట్లు ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేస్తున్నారు. సిగరేట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తూ.. ఈ ముఠా సభ్యులు చాకచక్యంగా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడం గ్రామంలో కిరాణం షాపు వద్దకు టీవీఎస్ అపాచీ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చి పెద్దగోల్డ్‌ఫాక్ సిగరేట్ డబ్బా కొనుగోలు చేసి రూ.500ల నోట్ ఇచ్చారు. కాగా ఆ నోట్‌ను తీసుకున్న కిరాణషాపు నిర్వాహకురాలు బెల్లంకొండ కాశమ్మ నోట్‌ను తన కూమారుడు సైదులుకు చూపించింది. ఆ నోట్‌ను నకిలీదని గుర్తించగానే ఆ ముఠా సభ్యులు బైక్‌పై పరారయ్యారు. దీంతో కిరాణషాపు నిర్వహకుడు గ్రామస్తుల సహకారంతో వారిని వెంబడించారు. దామరచర్ల సమీపంలో వారిని పట్టుకుని దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో దొంగనోట్లు ముద్రించి చలామణి చేస్తూ పట్టుపడిన వారిని, వారికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. వారి నుంచి హెచ్‌పీ కలర్ ప్రింటర్‌తో పాటు పేపర్‌కటింగ్ మిషన్, అపాచిబైక్, రూ.18.91లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ రవీందర్‌రెడ్డి, వాడపల్లి ఎస్ఐ చరమందరాజు పాల్గొన్నారు. -
బీజేపీ మోసం చేసింది: సజ్జాద్ లోన్
శ్రీనగర్: మంత్రిత్వ శాఖల కేటాయింపులో తనను అవమానించినందుకు జమ్మూ కశ్మీర్ సంకీర్ణం నుంచి వైదొలగుతానని వేర్పాటు వాది నుంచి రాజకీయ నేతగా మారిన సజ్జాద్ లోన్ తీవ్రంగా హెచ్చరించారు. మంత్రివర్గ కూర్పులో తమ నేతకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని సజ్జాద్ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. అధికార సంకీర్ణం నుంచి వైదొలగేందుకూ సిద్ధమని హెచ్చరించింది. తనకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పశు సంవర్ధక శాఖలు కేటాయించటంపై లోన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వాటి బాధ్యతలు స్వీకరించటానికి నిరాకరించారు, బుధవారం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వచ్చిన సందర్భంలో విమానాశ్రయానికి సదరు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక కారును, సెక్యూరిటీని తిరస్కరించి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఫోన్లను ఆపేశారు. పీడీపీతో ఎలాగూ పొత్తు కుదరడంతో ఇక తమ అవసరం లేదని బీజేపీ భావిస్తున్నట్లుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అహ్మద్ దార్ అన్నారు. అయితే పీడీపీ ఆచితూచి స్పందించింది.