మంచి చేయలేరు.. ఎదుటివారు చేస్తున్న మంచిని ఓర్చుకోలేరు. తాను పుట్టిన గడ్డకు కనీస న్యాయం చేయకపోగా, తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. రాయలసీమకు ఘనమైన చరిత్ర ఉంది. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి దుష్ప్రచారం చేయించిన ఘనుడు చంద్రబాబు.. ఆయన దిగజారుడు రాజకీయాలను కాస్త లోతుకెళ్లి పరిశీలిస్తే..
కరువు సీమ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. బాబు ఆదేశాల మేరకు, టీడీపీ దేవినేని ఉమ చౌదరి, కోడెల చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి రాయలసీమకు వైఎస్ జలాన్ని దోపిడీ చేస్తున్నారని ఆందోళన చేశారు.
కర్నూలుకు కొంచెం అయినా న్యాయం చేయండి అని బాబును అడిగితే కర్నూల్‌లో టీడీపీని 3 చోట్ల మాత్రమే గెలిపించారు నేనేందుకు చేయాలంటూ ముఖ్యమంత్రి బాబు అంటున్నాడంటూ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి రెండు సార్లు మీడియా ముందు చెప్పాడు. మద్రాస్‌లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో 10 వేల ఉద్యోగాలు కల్పించే హెచ్‌సీఎల్ ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంగా ప్రకటించారు. శివనాడార్‌పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేశాడు. కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో కెల్లా పెద్దది ఏఐఐఎంస్. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సి ఉంటే ఏఐఐఎంస్(All India Institute of Medical Sciences)ను సొంత కులస్థులు ఉన్న విజయవాడ గుంటూరుకు తరలించాడు.
చదవండి: చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా?
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్లు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ రాజధానికి సరైన ప్రాంతమని భావించింది. కానీ చంద్రబాబు దొనకొండలో రెడ్లు ఎక్కువగా ఉన్నారని, సొంత కులస్తులు ఉన్న విజయవాడ–గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేశాడు. కాపు గర్జన అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అంటూ అవమానం చేశాడు బాబు.. కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా కాపులను.. బాబు ఆదేశాల మేరకు సొంత కులస్థులు తీసే సినిమాల్లో రాయలసీమ అంటే ఏహ్య భావం కలిగేలా చూపుతారు. కమ్మ వాళ్లను జమిందార్లుగా స్వాతంత్ర సమర యోధుల్లాగా చూపిస్తూ.. రెడ్లను యాదవులని విలన్లుగా బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ని జోకర్లుగా చూపుతారు
చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
రాయలసీమలో ఉన్న శ్రీ సిటీని 2008లో ఆనాడు వైఎస్సార్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీలో పరిశ్రమల కేంద్రంగా ఉంది. నేడు శ్రీసిటీ లాగా.. కడప జిల్లా కొప్పర్తిని సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment