తలైవాకి వెన్నుపోటు తప్పదు! | Rajinikanth may betrayed by close aides in politics | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 9:47 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

Rajinikanth may betrayed by close aides in politics - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ.. కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్‌ అమ్మునై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్‌.. తలైవాకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏ మాత్రం లేదని తేల్చేశారు.  

‘‘రజనీకాంత్‌ ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్ఛితంగా రాణించగలరు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవటం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఆయన ఆశలు పెట్టుకోకపోవటమే మంచింది. ఆయన కింగ్‌ మేకర్‌ అవుతారే తప్ప.. కింగ్‌(సీఎం) కాలేరు’’ అని ప్రకాష్‌ ఓ జాతీయ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. 

అయితే సొంతవాళ్లే వెన్నుపోటే ప్రమాదం పొంచి ఉందని.. కాబట్టి రజనీ రాజకీయాలపరంగా ఎవరినీ నమ్మకపోవటమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. మకర రాశి, సింహ లగ్నంలో జన్మించిన రజనీకాంత్‌కు రాజకీయాల్లో అడ్డు ఉండబోదని ప్రకాష్‌ అన్నారు. 

రజనీకి పెటా విజ్ఞప్తి
పెటా ఇండియా శుక్రవారం రజనీకాంత్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. అభిమానంతో పేరిట మీ ఫ్యాన్స్‌ జంతువులను బలులు ఇస్తున్నారని.. ఆ చర్యలను అడ్డుకునేలా అభిమానులకు రజనీ పిలుపు ఇవ్వాలని పెటా కోరింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేసిన పెటా.. రాజకీయ ప్రవేశంపై రజనీకి అభినందనలు కూడా తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement