శ్రీనగర్: మంత్రిత్వ శాఖల కేటాయింపులో తనను అవమానించినందుకు జమ్మూ కశ్మీర్ సంకీర్ణం నుంచి వైదొలగుతానని వేర్పాటు వాది నుంచి రాజకీయ నేతగా మారిన సజ్జాద్ లోన్ తీవ్రంగా హెచ్చరించారు. మంత్రివర్గ కూర్పులో తమ నేతకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని సజ్జాద్ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. అధికార సంకీర్ణం నుంచి వైదొలగేందుకూ సిద్ధమని హెచ్చరించింది. తనకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పశు సంవర్ధక శాఖలు కేటాయించటంపై లోన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
వాటి బాధ్యతలు స్వీకరించటానికి నిరాకరించారు, బుధవారం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వచ్చిన సందర్భంలో విమానాశ్రయానికి సదరు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక కారును, సెక్యూరిటీని తిరస్కరించి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఫోన్లను ఆపేశారు. పీడీపీతో ఎలాగూ పొత్తు కుదరడంతో ఇక తమ అవసరం లేదని బీజేపీ భావిస్తున్నట్లుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అహ్మద్ దార్ అన్నారు. అయితే పీడీపీ ఆచితూచి స్పందించింది.
బీజేపీ మోసం చేసింది: సజ్జాద్ లోన్
Published Thu, Mar 5 2015 3:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement