cash deposits
-
సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్లైన్లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపింది. రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి? ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.2,000 నోటు ఉపసంహరణ మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు. చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే? -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
మోదీ మోసం చేశారు: రాహుల్
సాగర్/దామోహ్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ వంటి బూటకపు హామీలతో దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశంలో నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఎలా ఉన్నారో మీకు తెలుసా? దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ, సామాన్యులను ‘మిత్రులారా!’ అని సంబోధిస్తారు. కానీ ప్రజల సొమ్ముతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులను ‘భాయీ (సోదరా!)’ అని పిలుస్తారు. పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరుందని తాను చెప్పగానే శివరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించటాన్ని బట్టి, ఈ వ్యవహారంలో వాస్తవం మరేదో ఉందని అనిపిస్తోందన్నారు. -
‘డిమో’ డిపాజిట్ల గురించి రిటర్నుల్లో చెప్పాల్సిందే
అందుకోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ ఆధార్ నంబర్ పేర్కొనడం ఇకపై తప్పనిసరి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో చేసిన నగదు డిపాజిట్ల గురించి కొత్తగా ఆదాయపన్ను రిటర్నుల్లో తెలియజేయక తప్పదు. 2017–18 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి నూతన ఆదాయ పన్ను రిటర్నుల విషయమై ఆ శాఖ త్వరలోనే నిబంధనలను నోటిఫై చేయనుంది. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. చెల్లని నోట్లను మార్చుకోవడంతోపాటు అదే ఏడాది డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతించింది. ఈ కాలంలో చేసిన డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఆదాయపన్ను రిటర్నుల పత్రాల్లో ఒక కాలమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వేతన జీవులు సులభంగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా ‘సహజ్’ పేరుతో తీసుకురానున్న ఐటీఆర్–1లోనూ ఈ కాలమ్‌ను ఉంటుందని వెల్లడించాయి. డీమోనిటైజేషన్ సమయంలో నమోదైన అన్ని డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడమే దీని వెనుకనున్న ఉద్దేశంగా తెలిపాయి. -
అసాధారణ నగదు లావాదేవీలపై ఐటీ దృష్టి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 తర్వాత అసాధారణ స్థాయిలో నగదు డిపాజిట్లు చేసిన వ్యాపార సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో అమ్మకాలకు సంబంధించి భారీగా నగదు లావాదేవీలు చూపిన సంస్థల ఖాతాలను పరిశీలించనుంది. వ్యాపార ఆదాయాలుగా చూపుతూ.. నల్లధనాన్ని డిపాజిట్ చేశాయా అన్నది నిర్ధారణ చేసుకునేందుకు ఆయా సంస్థల అమ్మకాలు, నిల్వల గణాంకాల్లో అసాధారణ మార్పులేమైనా ఉన్నాయేమో చూడనుంది. గతంలో అదే వ్యవధిలో సాధారణంగా నమోదైన అమ్మకాల లావాదేవీలతో ఈ గణాంకాలను సరిపోల్చుకోనుంది. ‘డీమోనిటైజేషన్ అనంతరం పాత నోట్లతో సక్రమమైన పన్నులు చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ అమ్మకాలు భారీగా ఎగిసినట్లు చూపిస్తూ.. పలు వ్యాపార సంస్థలు అధిక మొత్తంలో పన్నులు (వ్యాట్, ఎక్సైజ్ సుంకం) కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసాధారణంగా కనిపించే నగదు లావాదేవీలపై దృష్టి సారించాలని నిర్ణయించడం జరిగింది అని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తులో భాగంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుమానాస్పద వ్యాపార సంస్థల నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలించనుంది. అలాగే నగదు డిపాజిట్ చేసిన తర్వాత సంస్థకు సంబంధం లేని బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం, కల్పిత కొనుగోళ్ల రూపంలో నిల్వలను పెంచి చూపించడం మొదలైన అంశాలపైనా దృష్టి పెట్టనుంది. -
ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే!
-
ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే!
నోట్ల రద్దు అనంతరం డార్మెంట్ బ్యాంకు అకౌంట్ల( దీర్ఘకాలికంగా వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు)లో దాదాపు రూ.25,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతేకాక లెక్కలో చూపని ఆదాయంగా రూ.3-4 లక్షల కోట్లను గుర్తించినట్టు ఐటీ శాఖ తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ బ్యాంకు అకౌంట్లపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో గుర్తించిన డిపాజిట్ వివరాలను ఐటీ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ వివరాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం సుమారు రూ.80వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లింపులు జరిగినట్టు చెప్పింది. సహకార బ్యాంకుల్లో వివిధ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసిన రూ.16వేల కోట్లకు పైగా డిపాజిట్లను ఐటీ డిపార్ట్మెంట్, ఈడీ విచారిస్తోందని వెల్లడించింది. 'నవంబర్ 9 నుంచి ఈశాన్య రాష్ట్రాలోని వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.10,700 కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 60 లక్షలకు పైగా బ్యాంకు అకౌంట్లలో రూ.2 లక్షల కంటే ఎక్కువగా డిపాజిట్ అయ్యాయి' అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. -
మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు
-
మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను అధికారులు మరో బాంబు పేల్చారు. రూ .15 లక్షల కోట్లపాతనోట్లు బ్యాంకులకు చేరాయన్న అంచనాలతో ఆదాయ పన్ను శాఖ బ్యాంకు నగదు డిపాజిట్ పోకడల విశ్లేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నవంబరు 8 కి ముందు బ్యాంకుల్లో జమ అయిన నగదుపై కూడా ఆరా తీస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 2016 నుంచి నవబంరు 9 వరకు ఆయా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్ల వివరాలను కూడా పరిశీలిస్తోంది. డీమానిటేజేషన్ కి ముందు నెలల్లో బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ శాఖ కోఆపరేటివ్ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల నగదు డిపాజిట్ల నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. పాన్ కార్డు వివరాలు గానీ, ఫాం60 గాని సమర్పించని ఖాతాదారుల డిపాజిట్ల వివరాలు అందించాలని కోరింది. సంబంధింత వివరాలను ఫిబ్రవరి 2017 లో సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా రూ.500, 1000 నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం భారీ సంచలనానికి తెర లేపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ కరెన్సీని నిరోధించేందుకంటూ చేపట్టిన ఈ డీమానిటైజేషన్ ప్రక్రియలో అనేక మార్పులు చేపట్టింది. నగదు కష్టాలకు అనేక ఉపశమన చర్యల్ని పక్రటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదాయ పన్ను అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా నవంబరు 9 తరువాత నవంబర్ 10-డిసెంబర్ 30, 2016 మధ్య బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల పొదుపుఖాతాలరూ.2.5 లక్షలకుపైన డిపాజిట్లను, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షల డిపాజిట్ల వివరాలను కోరింది. అలాగే ఒకే రోజులో రూ .50వేలకు మించిన నగదు డిపాజిట్ల వివరాలను అందించాలని కోరిన సంగతి తెలిసిందే. -
అమ్మో.. ఆన్లైన్
= బ్యాంకర్లకు మోదం..వినియోగదారులకు ఖేదం = పాతబకాయిలకు జమవుతున్న క్యాష్ డిపాజిట్లు = రైతులు, చేనేతల ఇబ్బందులు ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సంతోష్‌కుమార్ అత్యవసర పని నిమిత్తం స్నేహితుణ్ని రూ.15 వేలు అప్పు అడిగాడు. అతను ఆన్లైన్ ద్వారా నగదును సంతోష్ అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు తీసుకుందామని పట్టణంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లిన సంతోష్‌కు నిరాశే ఎదురైంది. ఈ మొత్తం మీరు తీసుకున్న లోన్‌కు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరిగి వచ్చేశాడు.. = ధర్మవరంలోని మాధవనగర్‌కు చెందిన శ్రీనివాసులు అనే చేనేత కార్మికుడు తాను నేసిన చీరను శిల్క్హౌస్లో విక్రయించాడు. దుకాణ యజమాని చీరకు చెల్లించాల్సిన మొత్తం రూ.12 వేలను శ్రీనివాసులు అకౌంట్‌కు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని తీసుకుందామని కెనరా బ్యాంకుకు వెళ్లగా.. లోన్‌కు జయియందని చెప్పారు. ఇంకా రూ.20 వేలు చెల్లించేవరకు మీ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకునే వీలు లేదన్నారు. దీంతో చీర తయారీకి తెచ్చిన ముడిసరుకు అప్పు ఎలా తీర్చేది, కుటుంబ పోషణకు ఏం చేసేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ధర్మవరం మండలం రావులచెరువుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి తన తోటలో పండిన టమాటాలను కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో విక్రయించాడు. మండీ యజమాని రూ.8 వేలను ఆన్లైన్ ద్వారా రామ్మోహన్‌రెడ్డి అకౌంట్‌కు జమ చేశాడు. దీంతో ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. ‘మీరు బంగారు తాకట్టుపెట్టి అప్పుతీసుకున్నారు. బంగారాన్ని సకాలంలో విడిపించుకోలేదు. దీంతో వేలం వేశాం. వచ్చిన మొత్తంతో మీరు తీసుకున్న అప్పు పూర్తిగా తీరలేదు. బకాయి రూ.5వేలు ఉంద’ని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆ మొత్తం పోగా మిగిలిన రూ.3వేలు ఇచ్చి పంపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక మీదట ఆన్లైన్ లావాదేవీలు చేయాలన్న మాట కూడా ప్రజల్ని మరింత కష్టాలపాలు చేస్తోంది. మరీముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారం చేనేత కార్మికులు, రైతులకు గుదిబండగా మారింది. వారు చేస్తున్న క్యాష్ డిపాజిట్లు గతంలో ఉన్న పాత బకాయిలకు జమ అవుతున్నారుు. ముఖ్యంగా రైతులు తాము తీసుకున్న క్రాప్, టర్మ్, సబ్సిడీ లోన్లు బ్యాంకులో తీసుకుని బకాయిలుంటే.. ఇప్పుడు తమ వద్దనున్న పెద్దనోట్లను డిపాజిట్ చేస్తే ఆ బకాయిలకు జమ అవుతున్నాయి. మొన్న ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడ్డ చాలా మంది రైతులు తమ పంట రుణాలను రెన్యూవల్ చేయలేదు. ఇటువంటి వారందరూ ఏదైనా పంట విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా తమ అకౌంట్లలోకి జమ చేయించుకుంటే.. వెంటనే పాత అప్పులకు వెళుతోంది. దీనివల్ల అత్యవసర కార్యమో..పంట సాగు చేయాలని తలపెట్టిన వారి పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. చేనేత కార్మికులది మరోసమస్య ధర్మవరంలో చేనేత కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు. వీరికి గతంలో మగ్గాలపై తీసుకున్న అప్పులు, సబ్సిడీ రుణాలకు సంబంధించిన బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చేనేత రుణమాఫీలో జాప్యం చేయడంతో రెండున్నరేళ్లకు సంబంధించిన వడ్డీ భారం పడింది. ప్రభుత్వ చేసిన రుణమాఫీ మొత్తం పోను.. వడ్డీ మొత్తం అలాగే బకాయిగా బ్యాంకుల్లో మిగిలి ఉంది. ప్రస్తుతం చేనేత కార్మికులు నగదు డిపాజిట్ చేసినా, పట్టు చీరలు విక్రరుుంచగా వచ్చిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా జమ చేయిచుకున్నా.. మొత్తం ఆ బకాయిలకు జమవుతోంది. దీంతో చేనేత కార్మికులు పడరానిపాట్లు పడుతున్నారు. చేనేత, రైతులే కాదు.. వివిధ రంగాల కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు కూడా ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. గతంలో బకాయిదారుల చుట్టూ తిరిగినా వసూలు కాని మొత్తాలు ఇప్పుడు తమ ప్రమేయం లేకుండానే వసూలు అవుతుండడంతో బ్యాంకర్లు లోలోన సంతోషపడుతున్నారు. -
పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
-
పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ : రద్దైన పాత నోట్ల చెల్లుబాటు విషయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలుసార్లు, పలుచోట్ల చెల్లుబాటు గడువులను పొడిగించిన కేంద్రం, డిపాజిట్ల విషయంలో అసలు తగ్గేది లేదని ప్రకటించింది. రద్దైన పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన డిసెంబర్ 30వ తేదీనే ఆఖరని, ఈ తేదీని ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని నేడు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని వెల్లడించింది. రద్దైన పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి, కొత్త నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పాత నోట్ల డిపాజిట్ల తుదిగడువును మార్చేది లేదని పేర్కొంది. బ్యాంకుల వద్ద సరిపడ నగదుతో పాటు, రూ.100 నోట్ల చలామణిని కూడా పెంచినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. డిసెంబర్ 30వ తేదీని పొడిగించే ఉద్దేశ్యమేమన్న ఉందా అనే ప్రశ్నకు, అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని వెల్లడించారు. గ్రామీణ ప్రజల అవసరార్థం రూ.100, అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను బ్యాంకులు సరఫరా చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగ, పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని, డిసెంబర్ 30వరకు పాత రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని వెల్లడించారు.