మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని తెలిపింది.
రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి?
ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
రూ.2,000 నోటు ఉపసంహరణ
మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్‌బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు.
చదవండి : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?
Comments
Please login to add a commentAdd a comment