పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన | Government not mulling December 30 cut-off extension for cash deposits | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 30 2016 7:49 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

రద్దైన పాత నోట్ల చెల్లుబాటు విషయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలుసార్లు, పలుచోట్ల చెల్లుబాటు గడువులను పొడిగించిన కేంద్రం, డిపాజిట్ల విషయంలో అసలు తగ్గేది లేదని ప్రకటించింది. రద్దైన పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన డిసెంబర్ 30వ తేదీనే ఆఖరని, ఈ తేదీని ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని నేడు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని వెల్లడించింది. రద్దైన పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి, కొత్త నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పాత నోట్ల డిపాజిట్ల తుదిగడువును మార్చేది లేదని పేర్కొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement