
చండీగఢ్ : హర్యానాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పాలక బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్‌ఎల్డీ, జేజేపీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎన్నికల ఫలితాలూ ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి రౌండ్‌లో ఆధిక్యం కనబరిచిన జేజేపీ, కాంగ్రెస్‌లు ఆ తర్వాత వెనుకంజ వేయగా ఐదో రౌండ్ ముగిసిన అనంతరం బీజేపీ 5737 ఓట్ల ఆధిక్యం సాధించింది.
జింద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున దిగ్గజ నేత రణ్‌దీప్ సుర్జీవాలా బరిలో నిలవగా, బీజేపీ తరపున మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మిద్ధా కుమారుడు కృష్ణ మిద్దా పోటీ చేశారు. ఐఎన్‌ఎల్లీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా రంగంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment