
కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
భోపాల్/భువనేశ్వర్: మధ్యప్రదేశ్‌లోని రెండు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ రెండింటిని నిలబెట్టుకోగా, బీజేడీ ఒక చోట గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లోని ముంగావోలీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేంద్ర సింగ్ కలుఖేడా ఆకస్మికంగా మృతి చెందటంతో ఫిబ్రవరి 24వ తేదీన ఉప ఎన్నిక జరిగింది.
కాంగ్రెస్ అభ్యర్ధి బ్రజేంద్ర సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన బైషాబ్ యాదవ్‌ను 2,124 ఓట్ల తేడాతో ఓడించారు. కొలరస్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ యాదవ్, బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్‌పై 8,083 ఓట్లతో గెలుపొందారు. ఒడిశాలోని బిజేపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబల్ సాహు గత ఏడాది ఆగస్టులో మృతి చెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు. బీజేడీకి చెందిన రితూ సాహు, బీజేపీ అభ్యర్ధి అశోక్ పాణిగ్రాహిపై 41, 933 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ది ప్రణయ సాహు మూడో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment