AIMIM Asaduddin Owaisi Slams SP Chief Akhilesh Yadav For BJP Victory in Bypolls - Sakshi
Sakshi News home page

Asaduddin Owaisi: బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది.. అతనొక అహంభావి: ఒవైసీ

Published Mon, Jun 27 2022 8:46 AM | Last Updated on Mon, Jun 27 2022 11:14 AM

Asaduddin Owaisi Blames SP Chief Akhilesh Yadav For Bypolls BJP Victory - Sakshi

న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు.

యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. 

అంతేకాదు రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. అఖిలేష్‌ యాదవ్‌ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు ఒవైసీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement