ఆ ఇద్దరు పెద్దలు ఇక ఢిల్లీకి
ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు తమ ఓటమిని అంగీకరించినట్లే అన్నారు రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా. ఇక దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు.
యూపీలో అధిక్యంలో కొనసాగుతున్నబీజేపీ
లక్నో: మద్యప్రదేశ్‌తోపాటు గుజరాత్‌లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం యూపీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుండగా.. ఎస్పీ 2 స్థానాల్లో.. బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
గుజరాత్‌లో బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.
హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కమల్‌నాథ్
కౌంటింగ్ జరుగుతున్నందున మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 28 సీట్లలో 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో.. కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి
9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్న బీజేపీ
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 9 స్థానాలోల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉంది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment