jyotiraditya sidhiya
-
ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
ఆ ఇద్దరు పెద్దలు ఇక ఢిల్లీకి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు తమ ఓటమిని అంగీకరించినట్లే అన్నారు రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా. ఇక దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. యూపీలో అధిక్యంలో కొనసాగుతున్నబీజేపీ లక్నో: మద్యప్రదేశ్తోపాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం యూపీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుండగా.. ఎస్పీ 2 స్థానాల్లో.. బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కమల్‌నాథ్ కౌంటింగ్ జరుగుతున్నందున మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 28 సీట్లలో 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో.. కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్న బీజేపీ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 9 స్థానాలోల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. భోపాల్: మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
రాజీనామా బాటలో రాహుల్ టీం
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆయన బృందం (టీం రాహుల్) కూడా అదే బాట పడుతోంది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ముంబై రీజనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవ్రాలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చాంద్ శనివారం రాజనామా చేయగా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నితిన్ రాత్ అంతకు ముందే పదవి నుంచి వైదొలిగారు. యువశక్తితో పార్టీని పునరుత్తేజితం చేయాలన్న కోరితో రాహుల్ గాంధీ వీరిని ఏరి కోరి మరీ వీరికి కీలక పదవులు అప్పగించారు. రాహుల్ మార్గదర్శకత్వంలో నడిచి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న తపనతో వారు పెద్ద బాధ్యతల్ని తలకెత్తుకున్నారు.అయితే, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరు కనబరచడం, ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ యువనేతల పని అగమ్యగోచరమయింది. అందుకే రాహుల్‌కు సంఘీభావంగా, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరు కూడా రాజీనామాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చొదాంకర్, ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్ లిలోతియా కూడా పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాహుల్ బృందం సభ్యులే కావడం గమనార్హం. ‘రాహుల్ ఆశయ సాధన కోసమే మేం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టాం. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో చుక్కాని లేని నావలయ్యాం. పార్టీలో మా భవిష్యత్తు ఏమిటో అర్థం కాక రాజీనామా చేశాం’అన్నారు ఓ యువ నాయకుడు. రాహుల్ హయాంలో నిశ్శబ్ధంగా ఉన్న సీనియర్లు ఇప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకొస్తున్నారు. రాహుల్ రాజీనామా విషయం, పార్టీ భవిష్యత్తుపై ఇటీవల జరిగిన చర్చల్లో అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మోతీలాల్ ఓరా, ఆనంద్ శర్మ,, భూపీందర్ సింగ్ హూడా వంటి తలనెరిసిన పెద్దలే పాల్గొన్నారు. ఇందులో యువ నాయకులెవరికీ అవకాశం కల్పించలేదు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాము జోక్యం చేసుకోబోమని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా అంతా పెద్దలే ఉన్నారు. దీన్ని బట్టి పార్టీలో ముందుముందు వారిదే పైచేయిగా కనబడుతోంది. రాహుల్ బృందం రాజీనామాలకు ఇదీ ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఎనిమిది అంశాల్లో మోడి దోషి
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడిని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఎనిమిది అంశాల్లో దోషిగా తేల్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడడమే కాకుండా ఫ్రాంచైజీలతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది. పరిపాలనా వ్యవహారాల్లోనూ ఎవరినీ లెక్కచేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్టు అరుణ్ జైట్లీ, జ్యోతిరాదిత్య సింధియా, చిరాయు అమీన్ నేతృత్వంలోని కమిటీ తమ 134 పేజీల నివేదికలో పేర్కొంది. ఈనెల 25న జరిగే బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లో మోడిపై జీవిత కాల బహిష్కరణ విధించే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికపై మోడి విరుచుకుపడ్డారు. జైట్లీ శ్రీనివాసన్ మనిషని, తానంటే వ్యతిరేకత చూపుతాడని ఆరోపించారు. ఓ జట్టు యజమానిగా శ్రీనివాసన్ ఉన్నా కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడిపై కమిటీ మోపిన అభియోగాలను పరిశీలిస్తే... 2010లో కొత్త ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం కోసం ముసాయిదా తయారుచేసింది. దీంట్లో బోర్డుకు తెలియకుండానే మోడి అసాధ్యమైన నిబంధనను చేర్చారు. బిడ్డర్ ఎవరైనా వారి ఆస్తుల విలువ ఒక బిలియన్ డాలర్లుండాలి. అలాగే బ్యాంకు గ్యారెంటీ కింద రూ.460 కోట్లు చూపాలి. అయితే బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ పాలక మండలి ఆమోదం పొందిన ముసాయిదాలో ఈ నిబంధనలు లేవు. తుది డ్యాక్యుమెంట్లో మోడి చేర్చారు. అయితే అప్పటి బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు ఈ విషయం చెప్పానని మోడి వాదన. ఇదంతా ఇద్దరు బిడ్డర్ల కోసం చేశాడని ప్యానెల్ ఆరోపించింది. 2010లో కొత్తగా ఐపీఎల్లో చేరిన పుణే, కొచ్చి టస్కర్స్‌పై మోడి వ్యతిరేకత చూపించారు. తమ హక్కులను కోల్పోవాల్సిందిగా లేకుంటే వివిధ కఠిన నిబంధనలు విధించి ఇబ్బందిపెడతానని కొచ్చి ప్రతినిధిని మోడి బెదిరించారు. అలాగే ఐపీఎల్ టీవీ ప్రసార, ఇంటర్నెట్ హక్కుల విషయంలో, ఇంగ్లండ్‌లోని క్లబ్బులతో కలిసి రెబల్ లీగ్‌కు ఏర్పాటు తదితర అంశాల్లో మోడిపై ఆరోపణలను మోపింది.