టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పతనానికి నాంది అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్ కాంగ్రెస్ విజయానికి పునాది వేశాయన్నారు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో కేవలం ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఘోర పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలకు మేఘాలయ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో ఆర్‌ఎల్డీ విజయం బీజేపీ వ్యతిరేక శక్తుల కలయికతోనే సాధ్యం అయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment