
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 6వ తేదీన ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య, తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో మున్సిపల్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా తాజాగా తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికకు కూడా దాదాపు సమయం ఆసన్నమైంది.
చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment