
సాక్షి, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు ప్రచారం చేయగా పెద్దవూర మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అయితే, త్రిపురారం మండలం పలుగు తండాలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్ధి రవినాయక్ కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలుగు తండా రవినాయక్ సొంత గ్రామం కావడంతో అతను గ్రామస్తులను హత్తుకుని ఏడ్చుకుంటూ ఓటు అడిగారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక్కసారిగా కంటతడి పెట్లుకొని ఓటు అభ్యర్ధించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, బీజేపీ అసమ్మతి నేత కంకణాల శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment