bi elections
-
సాగర్‌కు ఈశాన్య దిక్కు..చివరి గ్రామం
త్రిపురారం : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామమైన అబంగాపురం నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ సెంటిమెంట్‌ను ప్రతి ఎన్నికల్లో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రానికి అబంగాపురం గ్రామం చిట్టచివరి ఊరుగా ఉండంతోపాటు ఈశాన్య దిక్కుగా ఉంది. ఈ గ్రామంలో పూర్వకాలం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జానారెడ్డి ప్రతి ఎన్నికల్లో ఈశాన్య దిక్కున ఉన్న అబంగాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించడం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. సాగర్ నియోజకవర్గంలోని అబంగాపురం గ్రామం త్రిపురారం మండలంలో ఉండేది. కానీ మండలాల పునర్విభజన సందర్భంగా ఈ గ్రామాన్ని మాడుగులపల్లి మండలంలోకి మార్చారు. అయినప్పటికీ సాగర్ నియోజకవర్గంలోనే కొనసాగుతూ చిట్టచివరి ఊరుగా ఈశాన్య దిక్కున ఉంది. జానారెడ్డి సెంటిమెంట్‌ను 2018 ఎన్నికల్లో దివంగత నేత నోముల నర్సింహయ్య కూడా కొనసాగిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మరణానంతరం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు నోముల భగత్‌యాదవ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని తన తండ్రి ప్రారంభించిన గ్రామం నుంచే ప్రారంభించడం విశేషం. ఇదే సెంటిమెంట్‌ను బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్‌నాయక్ కూడా పాటిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయస్వావిుకి పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల కిందట జానారెడ్డి గెలుపును కాంక్షిస్తు ఆయన తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
సాగర్ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి
సాక్షి, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు ప్రచారం చేయగా పెద్దవూర మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, త్రిపురారం మండలం పలుగు తండాలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్ధి రవినాయక్ కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలుగు తండా రవినాయక్ సొంత గ్రామం కావడంతో అతను గ్రామస్తులను హత్తుకుని ఏడ్చుకుంటూ ఓటు అడిగారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక్కసారిగా కంటతడి పెట్లుకొని ఓటు అభ్యర్ధించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, బీజేపీ అసమ్మతి నేత కంకణాల శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలి
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో ప్రచార పరంగా ఇతరులతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయండి. ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుపొందాలి. పోలింగ్‌కు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతి ఓటరును కలిసేలా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయండి..’అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. పోలింగ్ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి ‘సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ఓటరును కలిసి మన ఎజెండాను వివరించడంతో పాటు పోలింగ్‌లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొంత అతి విశ్వాసంతో వెళ్లడంతో నష్టం జరిగింది. ఈసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటర్లతో చివరి నిమిషం వరకు మమేకం కావాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా లేదు. ఇతర అభ్యర్ధుల్లో ఒకరిద్దరి పట్ల ఓటర్లలో కొంత సానుభూతి ఉన్నా వారికి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం లేదు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 చోట్ల్ల మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ చివరి నిమిషం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి..’అని కేసీఆర్ సూచించారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి ‘ఈ నియోజకవర్గంలో 5 లక్షల పైచిలుకు పట్టభద్ర ఓటర్లు ఉండగా, ఇందులో సుమారు 3 లక్షల మందిని మన పార్టీ యంత్రాంగం ద్వారా నమోదు చేశాం. పోలయ్యే ఓట్లలో 50%కి పైగా ఓట్లు మన అభ్యర్థి సాధించేలా క్షేత్ర స్థాయిలో శ్రమించాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పనిచేయండి. క్షేత్ర స్థాయిలో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర క్రియాశీల నేతలు, కార్యకర్తలు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేయాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత సాగర్‌పై చర్చ! నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మరోమారు సమావేశమవుదామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన సమావేశం ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే సాగర్ ఉప ఎన్నికపై లోతైన చర్చ జరగలేదని, ఆ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఎన్నికతో పాటు ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వలసల దడ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలవేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక లోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ అసంతృప్తులపై వల విసురుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలం గౌడ్‌కు నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ మారినట్టు చర్చ జరుగుతోంది. గతంలోనూ బీజేపీలో చేరే జాబితాలో కూన పేరు వినిపించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల ప్రభావం ఉండడం కూడా బీజేపీలో చేరికకు కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇంకా ఎవరెవరంటే.. బీజేపీలో చేరనున్న నాయకుల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి సోయం బాపూరావు ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందారు. అయితే, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, రాథోడ్‌కు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే టికెట్‌పై హామీ ఇవ్వడంతో ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌రావుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారనే వార్తలు కూడా గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈమెతోపాటు మరో అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న యువనాయకుడిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు డీకే.అరుణ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల పేర్లు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నా వారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుండటం గమనార్హం. టికెట్ టికెట్... కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకునే క్రమంలో పార్టీ టికెట్ ఇస్తామనే హామీలు కమలనాథుల నుంచి వస్తున్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా వారు బీజేపీలోకి వెళుతున్నారని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు మూడు అసెంబ్లీ టికెట్లు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ టికెట్లపై బీజేపీ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని, కూన శ్రీశైలం గౌడ్‌కు కూడా కుత్బుల్లాపూర్ టికెట్ హామీ ఇవ్వడంతోనే ఆయన బీజేపీలో చేరారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు క్షేత్రస్థాయి నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వలసలపర్వం ఏయే మలుపులు తిరుగుతుందో... పార్టీలో ఉండేదెవరో, మిగిలేదెవరో అనే అంశం గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
డబ్బుల్లేక ఎన్నికలకు దూరం అంటున్న మాజీ ప్రధాని
బెంగళూరు: భారత మాజీ ప్రధాని, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవేగౌడ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో త్వరలో జరుగబోయే ఓ లోక్‌సభ, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని ప్రకటించారు. డబ్బుల్లేక పోవడంతో వారి పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో బెల్గాం లోక్‌సభతో పాటు బసవకళ్యాణ్, సింధి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 2023లో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషిని చేస్తానని దేవేగౌడ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. కాగా, దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవేగౌడ చేసిన ప్రకటనను రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఇలాంటి ప్రకటన చేసివుండవచ్చని అభిప్రాపడుతున్నాయి. -
పీసీసీ చీఫ్ మార్పు గురించి చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ మార్పు వంటి అంశాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘మా లక్ష్యం మిషన్-2023. మోదీ, కేసీఆర్ విధానాలపై పోరాడతాం. సిస్టమేటిక్ టీం వర్క్‌తో ముందుకు వెళతాం. తెలంగాణలో సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు పాటించాలి. దేశంలోని ప్రతి గవర్నర్ మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ మాత్రం వినతి పత్రం తెలుసుకోలేదు. గవర్నర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ కోరాం.. ఇవ్వలేదు. కోవిడ్ ఒక్క తెలంగాణలోనే లేదు. వినతిపత్రం మెయిల్ చేయమని చెప్పారు. కార్యకర్తల, నేతల మధ్య ఐక్యత కీలకం’ అన్నారు. (చదవండి: 2023లో అధికారమే లక్ష్యం ) దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టాయి. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. కుందేలు- తాబేలు కథలో.. చివరకు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అన్నారు. తెలంగాణ నేతలను ఇండియన్ క్రికెట్ టీంతో పొల్చారు. కాంగ్రెస్‌లో గ్రూపులపై స్పందిస్తూ.. ఐక్యతతో 2023 లో గెలుస్తామని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం అన్నారు. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమి చెప్పలేనన్నారు మాణిక్యం ఠాగూర్. -
తెలంగాణ వచ్చాకే అన్నీ మెరుగయ్యాయి
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామస్తులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మాణ పత్రాన్ని పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామస్తులు మంత్రికి అందించారు. కులసంఘాలు తమ మద్దతు తెలుపుతూ తీర్మాణ పత్రాలను అందజేసి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గ్రామస్తులు టీఆర్ఎస్పై ఉంచిన నమ్మకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. (సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు) 'నన్ను అసెంబ్లీకి పంపడంలో మొదటి పాత్ర దుబ్బాక నియోజకవర్గ పద్మనాభునిపల్లె గ్రామానిద. కేసీఆర్ కృషి వల్ల కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే సీఎం ధ్యేయం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నీ మెరుగయ్యాయి. ప్రతీ ఇంటికీ తాగునీరు, ప్రతీ ఎకరానికి సాగునీరు అందించడమే టీఆర్ఎస్ పార్టీ నినాదం. కాలంతో పని లేకుండా కాళేశ్వరం నీళ్లతో పద్మనాభునిపల్లె చెరువు నిండుకుండలా ఉంటుంది. గ్రామంలో యేడాది కిందటే మద్యం నిషేధం చేసిన గ్రామ యువత, విద్యార్థులను అభినందిస్తున్నా. బడా కార్పోరేట్ వేత్తల ముసుగులో నయా జమీందారు వ్యవస్థను బీజేపీ తెస్తున్నది. బీజేపీ.. రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నది. వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ, మార్కెట్లను రద్దు చేసే బీజేపీకి ఓటు బ్యాలెట్ తో తగిన గుణపాఠం చెప్పాలని' ఈ సందర్భంగా మంత్రి హరీష్ కోరారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి) -
ఉప ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఉప ఎన్నికల్లో తమను కూడా పోటీకి అనుమతించాలని కోరుతూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు అంగీకరించడం తెలిసిందే. ఈ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ముత్తిరెడ్డికి షాక్
ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి రెండు స్థానాలు విపక్షాలకే.. చెరొక స్థానాన్ని గెలచుకున్న కాంగ్రెస్, సీపీఎం జనగామ ఎమ్మెల్యేకు ఇబ్బందికర ఫలితాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జనగామ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు 8న ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇదే రోజు జనగామ మండలం మరిగడి, బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్, సీపీఎం చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండు ఎంపీటీసీ ఎన్నికలే అయినా... రాజకీయ పార్టీల గుర్తుపై జరిగినవి కావడంతో ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ ఫలితాలు ప్రస్తుత తరుణంలో మరింత ఇబ్బందులు పెంచే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశించిన మేరకు స్పందించలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. జిల్లా ఏర్పాటుపై ముందుగా దూకుడుగా వెళ్లి, తర్వాత ప్రభుత్వ స్థాయిలో సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు సాధన సమితి వరుసగా నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బంద్ నిర్వహించిన రోజు పలువురు ఉద్యమకారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియతో సొంత పార్టీలోనూ ముత్తిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌తో ముత్తిరెడ్డికి విభేదాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలో జనగామ జిల్లా ప్రస్తావన లేదు. అప్పటి నుంచి ముత్తిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ముత్తిరెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారాయి. – జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డి.సిద్ధయ్య విజయం సాధించారు. సిద్ధయ్యకు 963 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజుకు 710, సీపీఎం అభ్యర్థి బి.వెంకటరాజుకు 512, టీడీపీ అబ్యర్థి అశోక్‌కు 166, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. – బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎం.డి.మహబూబ్ విజయం సాధించారు. మహబూబ్‌కు 633 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పి.ఐలమ్మకు 519, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఐలమ్మ పోటీ చేశారు. -
ముత్తిరెడ్డికి షాక్
ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి రెండు స్థానాలు విపక్షాలకే.. చెరొక స్థానాన్ని గెలచుకున్న కాంగ్రెస్, సీపీఎం జనగామ ఎమ్మెల్యేకు ఇబ్బందికర ఫలితాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జనగామ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు 8న ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇదే రోజు జనగామ మండలం మరిగడి, బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్, సీపీఎం చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండు ఎంపీటీసీ ఎన్నికలే అయినా... రాజకీయ పార్టీల గుర్తుపై జరిగినవి కావడంతో ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ ఫలితాలు ప్రస్తుత తరుణంలో మరింత ఇబ్బందులు పెంచే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశించిన మేరకు స్పందించలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. జిల్లా ఏర్పాటుపై ముందుగా దూకుడుగా వెళ్లి, తర్వాత ప్రభుత్వ స్థాయిలో సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు సాధన సమితి వరుసగా నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ బంద్ నిర్వహించిన రోజు పలువురు ఉద్యమకారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియతో సొంత పార్టీలోనూ ముత్తిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌తో ముత్తిరెడ్డికి విభేదాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలో జనగామ జిల్లా ప్రస్తావన లేదు. అప్పటి నుంచి ముత్తిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ముత్తిరెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారాయి. – జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డి.సిద్ధయ్య విజయం సాధించారు. సిద్ధయ్యకు 963 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజుకు 710, సీపీఎం అభ్యర్థి బి.వెంకటరాజుకు 512, టీడీపీ అబ్యర్థి అశోక్‌కు 166, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. – బచ్చన్నపేట మండలం నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎం.డి.మహబూబ్ విజయం సాధించారు. మహబూబ్‌కు 633 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పి.ఐలమ్మకు 519, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఐలమ్మ పోటీ చేశారు. -
పాలేరులో 16న ఎన్నికలు
హైదరాబాద్: వచ్చే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారు. అదే నెల 19న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో పాలేరులో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్లు 29వరకు స్వీకరిస్తారు. వీటి పరిశీలన ఈ నెల30 వరకు ఉండనుంది. మే 2ని నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండనుంది.