హైదరాబాద్: రెండుమార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో తొలిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణను ప్రకటించడంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కుల,మతాలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు.
ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా
ఇక నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి మాట్లాడిన ఆయన.. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, అయినా పోటీకి దిగుతానన్నారు. తెలంగాణలో ఎక్కువసార్లు గెలిచింది తానేనని జానారెడ్డి తెలిపారు.
ఇక్కడ చదవండి: జానాకి పోటీ.. రంగంలోకి యువనేత
Comments
Please login to add a commentAdd a comment