రేవంత్‌రెడ్డి పార్టీని వీడటం.. తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు మెజారిటీ టీటీడీపీ నేతలు సిద్ధపడుతున్నారు. ఈ రాత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం కల్లా మెజారిటీ తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా రాజీనామాలు సమర్పించవచ్చునని వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయనతోపాటు టీడీపీ నేతలు చాలామంది హస్తం గూటికి వెళ్లవచ్చునని వినిపిస్తోంది. ఈ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని భావిస్తున్నారు.