26, 27 తేదీల్లో టీటీడీపీ ఆందోళనలు | TTDP concerns from 26, 27 | Sakshi
Sakshi News home page

26, 27 తేదీల్లో టీటీడీపీ ఆందోళనలు

Published Sun, Sep 25 2016 3:03 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ విమర్శించారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్

 సాక్షి,హైదరాబాద్: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ విమర్శించారు. ఈ విషయంలో సర్కారు నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు.

ప్రస్తుత వర్షాలతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో రహదారులు బాగుచేసి, ప్రజలకు తగిన సౌకర్యాలను కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement