కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోకాళ్లపై యాత్ర చేసినా తెలంగాణలో టీడీపీకి పుట్టగతులు ఉండవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోకాళ్లపై యాత్ర చేసినా తెలంగాణలో టీడీపీకి పుట్టగతులు ఉండవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఇంద్రవెల్లి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన విరుచుకుపడ్డారు. సోమవారం టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో కర్నె విలేకరులతో మాట్లాడారు. టీటీడీపీ నాయకులు ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని, మహానాడు సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతున్నటీటీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో పావులుగా మారారని దుయ్యబట్టారు.